శ్రీవారిని దర్శించుకున్న కర్ణాటక మంత్రి

ABN , First Publish Date - 2023-06-08T00:01:50+05:30 IST

ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామిని కర్ణాటక రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కేహెచ మునియప్ప దంపతులు బుధవారం దర్శించుకున్నా రు.

శ్రీవారిని దర్శించుకున్న కర్ణాటక మంత్రి

కదిరి అర్బన, జూన 7: ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామిని కర్ణాటక రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కేహెచ మునియప్ప దంపతులు బుధవారం దర్శించుకున్నా రు. మంత్రికి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో శ్రీవారికి పూజలు చేశారు. మునియప్ప దంపతులను ఆలయ అర్చకులు పూలమాల వేసి, శ్రీవారి చిత్రపటం బహూకరించి ప్రసాదాన్ని అందించి సన్మానించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన జరిపిటి గోపాలక్రిష్ణ, ఈఓ వెండిదండి శ్రీనివాసరెడ్డి, ప్రధాన అర్చకులు ఏవీ నరసింహాచార్యులు, కుమార్‌రాజాచార్యులు,పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు.

Updated Date - 2023-06-08T00:01:50+05:30 IST