కొత్త సారొచ్చారు.. పాత స్థానాలకు మార్చారు!

ABN , First Publish Date - 2023-05-09T23:56:19+05:30 IST

ఉమ్మడి జిల్లాలో అనంతపురం తరువాత హిందూపురం మున్సిపాలిటీనే పెద్దది. ఇక్కడ నిత్యం వివిధ పనుల కో సం కార్యాలయానికి వందల సంఖ్యలో ప్రజలు వస్తుంటారు. అదే స్థా యిలో మున్సిపాలిటీలోని అన్ని విభాగాల్లో అవినీతి పెచ్చుమీరిందన్న విమర్శలున్నాయి.

కొత్త సారొచ్చారు.. పాత స్థానాలకు మార్చారు!

గత కమిషనర్‌ పాలనలో

అవినీతి సిబ్బందికి స్థానచలనం

కొత్త కమిషనర్‌ రాకతో మారిన సీన

మళ్లీ పాత స్థానాలకే బదిలీ

పురం మున్సిపాలిటీలో అధికార పార్టీ హవా

హిందూపురం, మే 9: ఉమ్మడి జిల్లాలో అనంతపురం తరువాత హిందూపురం మున్సిపాలిటీనే పెద్దది. ఇక్కడ నిత్యం వివిధ పనుల కో సం కార్యాలయానికి వందల సంఖ్యలో ప్రజలు వస్తుంటారు. అదే స్థా యిలో మున్సిపాలిటీలోని అన్ని విభాగాల్లో అవినీతి పెచ్చుమీరిందన్న విమర్శలున్నాయి. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా... అవినీతి సి బ్బందిలో మార్పురాలేదు. ఈ పరిస్థితుల్లో కొంతమంది అడిగినంత ఇ చ్చుకోలేక... బాధితులు అవినీతి నిరోధక శాఖను ఆశ్రయించారు. ఈ తరుణంలో కొద్దినెలల క్రితం ఏసీబీ అధికారులు దాడి చేసిన విషయం తెలిసిందే. లంచం తీసుకుంటూ మున్సిపాలిటీ రెవెన్యూ విభాగంలోని అధికారి రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుపడడం అప్పట్లో కలకలం రేపింది. ఈ పరిణామంతో కొంతమంది సిబ్బంది కార్యాలయాలకు కూడా రాకుండా సెలవుపై వెళ్లారు. ఉన్నతాధికారులు సీరియ్‌సగా పరిగణించారు. ఇ క్కడి సిబ్బందిపై ఫిర్యాదుల ఆధారంగా కొంతమందిని మార్చాలని అ ప్పటి కమిషనర్‌ వెంకటేశ్వరరావును ఆదేశించారు. దీంతో ఏడుగురు సి బ్బందిని స్థానాలు మార్చారు. మున్సిపాలిటీలోని ముఖ్య ప్రజాప్రతినిధులతో పాటు మరో ముఖ్య ప్రజాప్రతినిధి కమిషనర్‌పై ఒత్తిడి తెచ్చి నా ఆయన తగ్గలేదు. కమిషనర్‌ ఇటీవల బదిలీ కావడంతో కొత్త కమిషనర్‌ వచ్చారు. ఇక అవినీతి సిబ్బందికి మళ్లీ పండుగొచ్చింది. వారం తా యధాతథంగా పాత స్థానాలకే వెళ్ళారు.

ఏసీబీ ఎఫెక్ట్‌తో..

హిందూపురం మున్సిపాలిటీలోని కొన్ని విభాగాల్లో చేయి తడపనిదే పని జరగదన్న సామెతను నిజం చేస్తున్నారు. ఇక్కడ టౌన ప్లానింగ్‌, రెవెన్యూ విభాగం, జనన మరణ ఽధృవీకరణ విభాగాల్లో వారు అడిగినం త ఇస్తే తప్పా ఏ పనీ జరగదన్న విమర్శలున్నాయి. పలుమార్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందాయి. దీంతో అవినీతి నిరోధక శాఖ నిఘా పెట్టింది. కొద్ది నెలల క్రితం రెవెన్యూ విభాగంపై ఫిర్యాదుతో నిఘా ఉంచి పట్టుకున్నారు. అదే రోజు మూడు విభాగాలపై దాడి చే యాలని వచ్చినా కొంతమంది సిబ్బంది అలర్టు కావడంతో తప్పిం చుకున్నారు. ఈకారణంగానే టౌన ప్లానింగ్‌, రెవెన్యూ విభాగం జనన మరణ ధృవీకరణ, అడ్మినిస్ర్టేటివ్‌ విభాగాల నుంచి చాలాఏళ్లుగా పాతు కు పోయిన వారికి అప్పటి కమిషనర్‌ స్థానాలు బదిలీ చేశారు.

ఒకేసారి ఏడుగురిని...

ఏసీబీ దాడుల అనంతరం ఒకేసారి ఏడుగురిని వేరే విభాగాలకు బ దిలీ చేశారు. అయితే వీరిలో అదే విభాగాల్లో నాలుగైదేళ్లుగా పని చేసిన వారు ఉన్నారు. వారిని ఇతర విభాగాలకు మార్చితే తప్పా వారి అలవాటు మార్చుకోరని కమిషనర్‌ భావించారు. అయితే ఒకరిద్దరికి డిజిటల్‌ కీ పాస్‌వర్డ్‌ ఇవ్వకుండా వచ్చారు. కమిషనర్‌ బదిలీ అయిన వెంకటనే... మేం పాత స్థానాలకు వస్తామని అవినీతి సిబ్బంది చాలెంజ్‌ చేశారు. వారు అనుకున్నట్లే కొత్త కమిషనర్‌ రాగానే తతంగం పూర్తి చేసుకున్నారు.

నాయకుల అండతోనే..?

అప్పట్లో విభాగాలు మార్చిన సిబ్బందికి అధికార పార్టీ నాయకుల అండ పుష్కలంగా ఉండేదన్న చర్చ సాగుతోంది. ఈ పరిస్థితుల్లో వారిని బదిలీ చేసినా పాత స్థానాలు దక్కించుకున్నారు. ఇందుకు ప్రధాన కారణం ముఖ్య ప్రజాప్రతినిధి వద్ద ఉన్న వారితో పాటు మున్సిపాలిటీ లోని ప్రజా ప్రతినిధుల అండ కొండంత ఉందని వారు బహిరంగంగా చెప్పుకుంటున్నారు. దీంతో తమని ఎవరూ ఏమీ చేయలేరన్న ధైర్యం వారికి ఉంది. ఈకారణంగానే పాత స్థానాలకే బదిలీ అయ్యారు. అప్పటి కమిషనర్‌ తీసుకున్న నిర్ణయాన్ని కొత్త కమిషనర్‌ వచ్చాక మార్చడంతో మున్సిపాలిటీలో చర్చనీయాంశమైంది.

పాలనాసౌలభ్యం కోసమే మార్పు

ప్రమోద్‌కుమార్‌, మున్సిపల్‌ కమిషనర్‌

మున్సిపాలిటీలో కొన్ని విభాగాల్లో కొందరిని మార్చడం జరిగింది. పాలనాసౌలభ్యం కోసమే మార్పు చేశాం. గతంలో ఎందుకు మార్చారో నాకు తెలియదు. ఎవరైనా అవనీతికి పాల్పడితే ఉపేక్షించేదిలేదు. వారిపై నిఘా ఉంచుతాం.

Updated Date - 2023-05-09T23:56:19+05:30 IST