17న ఎన్టీఆర్‌ శత జయంత్యుత్సవం

ABN , First Publish Date - 2023-05-05T23:55:01+05:30 IST

ఎన్టీఆర్‌ శతజయంతి ఉత్సవాలను ఈనెల 17న మడకశిరలో నిర్వహించనున్నట్లు టీడీపీ నియోజకవర్గ కోఆర్డినేటర్‌ గుండుమల తిప్పేస్వామి తెలిపారు.

17న ఎన్టీఆర్‌ శత జయంత్యుత్సవం

మడకశిరటౌన, మే 5: ఎన్టీఆర్‌ శతజయంతి ఉత్సవాలను ఈనెల 17న మడకశిరలో నిర్వహించనున్నట్లు టీడీపీ నియోజకవర్గ కోఆర్డినేటర్‌ గుండుమల తిప్పేస్వామి తెలిపారు. శుక్రవారం పట్టణం లోని పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ ఉత్సవా లు కొనసాగుతున్నాయన్నారు. అందులో భాగంగా శ్రీసత్యసాయి జిల్లాలో జరగాల్సిన వేడుకలకు మడ కశిర వేదికైందని పేర్కొన్నారు. పేదల గుండెల్లో శా శ్వతంగా ముద్ర వేసుకొన్న గొప్ప వ్యక్తి నందమూరి తారక రామారావు అని, ఆయన ఉత్సవాలు ఇక్కడ నిర్వహించడం గర్వకారణంగా ఉందని అన్నారు. వేదిక, ఏర్పాట్లపై శనివారం జిల్లా నాయకులు పర్యటిస్తారని తెలిపారు. ఎనటీఆర్‌ శత జయంతి ఉత్సవాలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

Updated Date - 2023-05-05T23:55:01+05:30 IST