పాహిమాం.. పరమేశ్వరీ..!
ABN , First Publish Date - 2023-07-14T23:47:19+05:30 IST
ఆర్యవైశ్యుల ఆరాధ్యదైవమైన వాసవీమాత శాకాంబరిగా భక్తులకు దర్శనమిచ్చారు. పట్టణ పరిధిలోని డీబీ కాలనీలో నూతనంగా నిర్మించిన ఆష్టలక్ష్మీ ఆలయ ప్రాంగణంలో వెల సిన వాసవాంబను శుక్రవారం శాకాంబరిగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు.
అమ్మవార్లకు ప్రత్యేక పూజలు
హిందూపురం అర్బన, జూలై 14: ఆర్యవైశ్యుల ఆరాధ్యదైవమైన వాసవీమాత శాకాంబరిగా భక్తులకు దర్శనమిచ్చారు. పట్టణ పరిధిలోని డీబీ కాలనీలో నూతనంగా నిర్మించిన ఆష్టలక్ష్మీ ఆలయ ప్రాంగణంలో వెల సిన వాసవాంబను శుక్రవారం శాకాంబరిగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. సకాలంలో వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని, ప్రజలు సుఖశాంతులతో జీవించాలని అమ్మవారిని శాకాంబరిగా పూజించినట్లు అ ర్చకులు పేర్కొన్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి దర్శించుకున్నారు.
హిందూపురం అర్బన: పట్టణ పరిధిలోని నింకంపల్లి రోడ్డులో వెలసిన గ్రామదేవత యల్లమ్మదేవి ఆలయంలో ఆషాఢమాసం చివరి శుక్రవారాన్ని పురస్కరించుకొని విశేష పూజలు నిర్వహించారు. ఉదయం మూలవిరాట్‌కు వివిధ అభిషేకాలు అర్చనలు చేశారు. అమ్మవారిని శాకాంబరిగా అలంకరించారు. సాయంత్రం ప్రత్యేక భజన కార్యక్రమాలు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.
లేపాక్షి : లేపాక్షి పంచాయతీ గొంగటిపల్లిలో పురాతనంగా వెలసిన గ్రా మదేవత ముత్యాలమ్మ ఆలయంలో శుక్రవారం గ్రామస్థులు ప్రత్యేక పూజ లు నిర్వహించారు. పంటలు బాగా పండాలని గ్రామంలో ప్రజలు, పశువు లు సుభిక్షంగా ఉండాలని యేటా అమ్మవారికి ప్రత్యేకపూజలు, అన్న దానం నిర్వహిస్తున్నట్లు గ్రామస్థులు తెలిపారు. అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి, అర్చనలు చేశారు. అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు.