బళ్లారి రాఘవ అవార్డుల ప్రదానం
ABN , First Publish Date - 2023-08-02T23:52:42+05:30 IST
బళ్ళారి రాఘవ 143వ జయంతిని పురస్కరించుకుని బుధవారం సాయంత్రం అనంతపురం లలితకళా పరిషత్ ఆవరణలో అవార్డుల ప్రదానోత్సవాన్ని నిర్వహించారు.
అనంతపురం కల్చరల్, ఆగస్టు 2 : బళ్ళారి రాఘవ 143వ జయంతిని పురస్కరించుకుని బుధవారం సాయంత్రం అనంతపురం లలితకళా పరిషత్ ఆవరణలో అవార్డుల ప్రదానోత్సవాన్ని నిర్వహించారు. పరిషత అధ్యక్షుడు వెంకట సుబ్బయ్య అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఏపీ నాటక అకాడమీ చైర్‌పర్సన హరిత రాజగోపాల్, పరిషత ప్రధాన కార్యదర్శి, న్యాయవాది గాజుల పద్మజ హాజరయ్యారు. రాఘవ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం చిన్నారులు శాస్త్రీయ సంప్రదాయ నృత్యాలతో అలరించారు. తదనంతరం 2023 సంవత్సరానికి సంబంధించి బళ్లారి రాఘవ అవార్డులకు ఎంపికైన కళాకారులు లక్ష్మినారాయణ (పౌరాణికం), చిదంబరరెడ్డి (పౌరాణికం), అరుణ్‌బాబు (సాంఘికం), డీఏ ఖాదర్ (సాంఘికం)కు బళ్లారి రాఘవ అవార్డులు అందజేశారు. కార్యక్రమంలో నగరపాలకసంస్థ డిప్యూటి మేయర్ కోగటం విజయభాస్కర్‌రెడ్డి, కళాకారులు సంగాల నారాయణస్వామి, ఉంగరాల శ్రీనివాసులు, సోమిరెడ్డి, దాయనంద్, అస్లాంబాషా, లోకేష్, శ్రీనివాసులు, బీఎస్‌ఎనఎల్ రాజశేఖర్‌రెడ్డి, షేక్ రియాజుద్దీన పాల్గొన్నారు.