కబ్జాకోరల్లోని ప్రభుత్వ భూమిని కాపాడండి

ABN , First Publish Date - 2023-06-05T23:58:41+05:30 IST

మండలంలోని బొంతపల్లిలో ప్రభుత్వ భూమి కబ్జాకు గురికాకుండా కాపాడాలని సీపీఐ నాయకులు డిమాండ్‌ చేశారు.

కబ్జాకోరల్లోని ప్రభుత్వ భూమిని కాపాడండి

సీపీఐ డిమాండ్‌

తహసీల్దారు కార్యాలయం వద్ద ధర్నా

తనకల్లు, జూన 5: మండలంలోని బొంతపల్లిలో ప్రభుత్వ భూమి కబ్జాకు గురికాకుండా కాపాడాలని సీపీఐ నాయకులు డిమాండ్‌ చేశారు. సోమవారం స్థానిక తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట పార్టీ ఆధ్వర్యంలో ఎర్రజెండాలు చేతపట్టుకుని బైఠాయించారు. ఈసందర్భంగా నాయకులు మాట్లాడుతూ అన్నమయ్య జిల్లా మొకలచెరువు మండల సరిహద్దులో బొంతపల్లికి చెందిన ప్రభుత్వ భూమి కబ్జాకు యత్నిస్తున్నారన్నారు. ఇప్పటికే పలుమార్లు అధికారులకు విన్నవించినా, రెవెన్యూ అధికారులు స్పందించలేదని వాపోయారు.. సర్వేనెంబర్లు 180, 180ఏ2, 181, 182, 183బీ1, 183 ఏ1, 183 బీ4, 184, 185, 186, 189లో 110 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జాదారుల కోరల్లో చిక్కుకుందని ఆరోపించారు. ఆభూమిని కాపాడి ఇళ్లులేని పేదలకు ఇంటిపట్టాలు మంజూరు చేయాలని కోరారు. ప్రభుత్వ భూములను యథేచ్ఛగా కబ్జా చేసి, ప్లాట్లు వేసి విక్రయిస్తున్నా రెవెన్యూ యంత్రాంగం స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం తహసీల్దార్‌ మధునాయక్‌కు వినతిపత్రం అందజేశారు. నిరసనలో సీపీఐ మండల అధ్యక్షులు రెడ్డెప్ప, తాలూకా అధ్యక్షుడు కదిరప్ప, జిల్లా నాయకులు హనుమంతురెడ్డి, రాజేంద్ర ప్రసాద్‌, ఇక్బాల్‌, కరీముల్లా, కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

Updated Date - 2023-06-05T23:58:41+05:30 IST