తాగునీటికి పురం ప్రజల తంటాలు
ABN , First Publish Date - 2023-04-23T23:50:25+05:30 IST
పట్టణంలో తాగునీటి కష్టా లు మళ్లీ మొదటికొచ్చాయి. నీటి సరఫరా వనరులున్నా పంపిణీలో అ ధికారుల వైఫల్యం తేటతెల్లమౌతోంది. ఫలితంగా మండే వేసవిలో తా గునీటి కోసం కాలనీల వాసులు పడిగాపులు పడుతున్నారు.
వారం రోజులుగా నీటి సరఫరా బంద్
ప్రైవేట్ వాటర్ ట్యాంకర్లను ఆశ్రయిస్తున్న జనం
నీటి వనరులున్నా సరఫరాలో వైఫల్యం
భగ్గుమంటున్న కాలనీల వాసులు
హిందూపురం అర్బన, ఏప్రిల్ 23: పట్టణంలో తాగునీటి కష్టా లు మళ్లీ మొదటికొచ్చాయి. నీటి సరఫరా వనరులున్నా పంపిణీలో అ ధికారుల వైఫల్యం తేటతెల్లమౌతోంది. ఫలితంగా మండే వేసవిలో తా గునీటి కోసం కాలనీల వాసులు పడిగాపులు పడుతున్నారు. విధిలేక ప్రైవేట్ ట్యాంకర్ల నుంచి నీటి కొనుగోలు చేయాల్సిన దుస్థితి నెలకుం ది. వారం రోజులుగా పట్టణవ్యాప్తంగా నీటిఎద్దడి జటిలమైంది. తెలు గుదేశం పార్టీ హయాంలో హిందూపురం నీటి కష్టాలకు తెరదించారు. గొల్లపల్లి రిజర్వాయర్ నుంచి ప్రత్యేక పైపులైన ఏర్పాటు చేసి, నీటి స రఫరాకు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ఈక్రమంలో దశాబ్దాలుగా తా గునీటి కోసం అలమటించిన జనానికి ఊరటకలిగింది. అయితే వైసీపీ ప్రభుత్వం గద్దెనెక్కాక నీటి సరఫరా నిర్వహణ అధ్వానంగా మారింది. వర్షాలు సమృద్ధిగా కురిసి, నీటి వనరులు అందుబాటులో ఉన్నా ప్రజ లకు అందించలేకపోతున్నారన్న విమర్శలున్నాయి. వారం రోజులుగా హిందూపురానికి గొల్లపల్లి రిజర్వాయర్ నుంచి నీటి సరఫరా బంద్ అ య్యింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రైవేట్ ట్యాంకర్ల యాజమాన్యాలకు ఈతతంగం కాసులు కురిపిస్తోంది. నీటి డిమాండ్ ఏర్పడటంతో ట్యాంకర్ల ధర పెంచి విక్రయించి సొమ్ము చేసు కుంటున్నారు. గొల్లపల్లి రిజర్వాయర్ వద్ద ట్రాన్సఫార్మర్ కాలిపోయిన ట్లు మున్సిపల్ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. కొండ ప్రాంతంలో కొండకు నిప్పు అంటుకొని, కేబుల్, ట్రాన్సఫార్మర్ కాలిపోయినట్లు చెబు తున్నారు. ట్రాన్సఫార్మర్‌ను అనంతపురం నుంచి, కేబుల్‌ను హైదరాబా ద్ నుంచి తెప్పించినట్లు తెలుస్తోంది. మోటార్లు, ట్రాన్సఫార్మర్, విద్యుత తీగల మరమ్మతులు చేపట్టినా హిందూపురానికి నీరు మరో రెండు రోజుల వరకు అందవని మున్సిపల్ నీటి సరఫరా విభాగం అధికారు లు చెబుతున్నారు.
వారం రోజలుగా నీరు సరఫరా కాకపోవడంతో పు రంలో మునుపటి పరిస్థితులను తలపిస్తున్నదని ప్రజలు ఆవేదన చెం దుతున్నారు. చెరువులు నిండినా తాగునీరు సక్రమంగా అందించడం లో అధికార యంత్రాంగం పూర్తిగా విఫలమైందని విమర్శిస్తున్నారు. పన్నులు వసూళ్లకు మాత్రం ముందుంటారని ఆగ్రహిస్తున్నారు. సా మాన్యులు, రోజు కూలీలు తాగునీరు కొనడం గగనమవుతోంది. ఇంట్లో వాడుకునేందుకు కూడా నీరు కొనాలంటే ఇబ్బందిగా ఉందంటున్నారు. ఒక ట్యాంకర్ నీటికి రూ.500 చెల్లించాల్సి వస్తున్నది. కూలీ చేస్తే వచ్చే డబ్బులు సంసారానికే సరిపోతుందని, ఇక నీరు కొనాలంటే అప్పు చే యాల్సి వస్తుందని వాపోతున్నారు. చాలాప్రాంతాల్లో ప్రైవేట్ ట్యాంకర్ల వద్ద నుంచి కొని సంపులు నింపుకొని నీటిని పొదుపుగా వాడుతున్నట్లు కాలనీవాసులు చెబుతున్నారు.
నీరు కొనాలంటే ఇబ్బందిగా ఉంది
మారుతి, చేనేత కార్మికుడు, ముద్దిరెడ్డిపల్లి
మేము కూలి చేస్తే కుండ కాలుతుంది. లేకపోతే కడుపు మాడుతుంది. కూలీ డబ్బుతో ని త్యావసర సరుకులు కొనుగోలుకే సరిపోవడంలేదు. పెరిగిన ధరలు భయపెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో నీరు కూడా కొనుగోలు చేయాలంటే అప్పులు చేయక తప్పదు.
సాంకేతిక కారణాలతో నీటి సరఫరాలో అంతరాయం
నీరజ, మున్సిపల్ డీఈ
గొల్లపల్లి రిజర్వాయర్ వద్ద నీటి సరఫరాకు సాంకేతిక సమస్య ఏ ర్పడింది. కొండ ప్రాంతంలో నిప్పు రగలడంతో విద్యుత కేబుల్ కాలిపోయింది. ట్రాన్సఫార్మర్ మరమ్మతులకు గురైంది. అనంతపురం నుంచి ట్రాన్సఫార్మర్, హైదరాబాద్ నుంచి కేబుల్ తెప్పించాం. ము న్సిపల్, విద్యుతశాఖ సిబ్బంది కలిసి పనిచేయడంతో సమస్య పరిష్కారమైంది. బుధవారం రాత్రి నుంచి నీరు సరఫరా అవుతుంది. అయితే పట్టణమంతా సరఫరా కావడానికి సమయం పడుతుంది.