భక్తిశ్రద్ధలతో రంజాన

ABN , First Publish Date - 2023-04-23T00:05:28+05:30 IST

ముస్లింల పవిత్ర రంజాన పర్వదినాన్ని శనివారం జిల్లావ్యాప్తంగా భక్తిశ్రద్ధలతో జరు పుకున్నారు. ఉదయాన్నే ముస్లింలు ఈద్గా మైదానాలకు చేరుకున్నారు. సా మూహిక ప్రార్థనలు చేశారు.

భక్తిశ్రద్ధలతో రంజాన

హిందూపురంఅర్బన/మడకశిరటౌన/అగళి/లేపాక్షి/గోరంట్ల/ పరిగి/పెనుకొండ/రొద్దం/గుడిబండ/పావగడ, ఏప్రిల్‌ 22: ముస్లింల పవిత్ర రంజాన పర్వదినాన్ని శనివారం జిల్లావ్యాప్తంగా భక్తిశ్రద్ధలతో జరు పుకున్నారు. ఉదయాన్నే ముస్లింలు ఈద్గా మైదానాలకు చేరుకున్నారు. సా మూహిక ప్రార్థనలు చేశారు. మత పెద్దలు మహ్మద్‌ ప్రవక్త సందేశాన్ని బో ధించారు. అనంతరం ముస్లింలు ఒకరికొకరు ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. పేదలకు దానం చేశారు. సామూహిక విం దు భోజనాలు ఆరగించారు. హిందూపురంలో మౌలానా మన్నాన, ముతవల్లి నూరుల్లాఖాన ఆధ్వర్యంలో ఆర్‌పీజీటీ రోడ్డులోని అల్‌హిలాల్‌ ఈద్గా మైదానంలో ప్రత్యేక సామూహిక ప్రార్థనలు చేశారు. మహ్మద్‌ ప్రవక్త సం దేశాన్ని ప్రతి ముస్లిం ఆచరించాలని మతపెద్దలు బోధించారు. తెలుగుదేశం పార్టీ నాయకులు అంబికా లక్ష్మీనారాయణ, శ్రీనివాసరావు, డీఈ రమే్‌ష, కొల్లకుంట అంజినప్ప, అమర్‌, బాచి, నబీ, అంజాద్‌ తదితరులు ఈద్గా మై దానికి వెళ్లి ముస్లింలకు పండుగ శుభాకంక్షలు తెలియజేశారు. మడకశిర లో ముస్లింలు ర్యాలీగా ఈద్గా మైదానానికి వెళ్లి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అగళిలోని మసీదు నుంచి ఈద్గా మైదానం వరకు ర్యాలీగా వెళ్లి ప్రా ర్థనలు చేశారు. జడ్పీటీసీ ఉమే్‌ష, పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్త లు ముస్లింలకు పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. లేపాక్షిలో ఉదయ మే మసీదుల్లో ప్రార్థనలు చేశారు. అనంతరం ఈద్గా వద్దకు ర్యాలీగా తరలి వెళ్లి, సామూహిక ప్రత్యేక ప్రార్థనలు చేశారు. గోరంట్లలోని మసీదుల నుం చి ముస్లిం పెద్దలు, పిల్లలు ఈద్గా వద్దకు చేరుకుని సామూహిక ప్రార్థనలు చేశారు. అనంతరం శ్మశాన వాటికలోని పెద్దల సమాధులను దర్శించుకున్నారు. ఒకరునొకరు ఆలింగనం చేసుకుని ఈద్‌ముబారక్‌ శుభాకాంక్షలు తె లుపుకున్నారు. పేదలకు దానధర్మాలు చేశారు. బంధువులు, స్నేహితులను విందు భోజనాలకు ఆహ్వానించి ఆనందంగా గడిపారు. పరిగి ఈద్గా మైదానంలో వందలాది మంది ముస్లింలు ప్రార్థనలు చేశారు. పెనుకొండలో ఉ దయమే ముస్లింలు ప్రార్థనా మందిరాలకు చేరుకున్నారు. అనంతరం ఊరేగింపుగా ఈద్గా మైదానం చేరుకుని సామూహిక ప్రార్థనలు నిర్వహించారు. రొద్దంలో ముస్లింలు మసీదుకెళ్ళి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. గుడిబండ మండలం మందలపల్లి, గుడిబండ, ఎస్‌ రాయాపురం, కొంకల్లు, రాళ్లపల్లి, శంకరగల్లు, హుసేనపురం గ్రామాల్లో ముస్లింలు ఈద్గా మైదానంలో ప్రార్థన లు నిర్వహించారు. పావగడలో ముస్లింలు ఈద్గా మైదానంలో వేలాది మం ది సామూహిక ప్రార్థనలు చేశారు. తహసీల్దార్‌ సుజాత ముఖ్య అతిథిగా హాజరై ముస్లింలకు రంజాన శుభాకాంక్షలు తెలియజేశారు. సర్వధర్మ శాం తిపీఠం అధ్యక్షుడు రాంమూర్తి స్వామిజీ ముస్లిం మతపెద్దలకు ఖురాన గ్రంథాన్ని కానుకగా ఇచ్చారు. ముస్లిం మత పెద్దలు లతీ్‌ఫసాబ్‌, గౌస్‌మొద్దీన, జావీద్‌, షాబాబు, రిజ్వానుల్లా, యూను్‌సఖాన, ఫజ్‌లుల్లా, అన్వర్‌సాబ్‌ తదితరులు ఖురాన సారాంశాన్ని చదివి శుభాకాంక్షలు తెలియజేశారు.

Updated Date - 2023-04-23T00:05:28+05:30 IST