నాసిరకం మద్యంతో ప్రజల ప్రాణాలతో చెలగాటం
ABN , First Publish Date - 2023-04-09T00:01:40+05:30 IST
నాసిరకం మద్యంతో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతు న్న నరరూప రాక్షసుడు సీఎం జగన్మోహనరెడ్డి అని రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి స విత మండిపడ్డారు.
టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సవిత
పెనుకొండ, ఏప్రిల్ 8: నాసిరకం మద్యంతో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతు న్న నరరూప రాక్షసుడు సీఎం జగన్మోహనరెడ్డి అని రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి స విత మండిపడ్డారు. శనివారం పట్టణంలోని ఆమె క్యాంపు కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. నాలుగేళ్లలో జగన్మోహనరెడ్డి మద్యం దోపిడీ... రూ.41వేల కోట్లకు చేరిందని అన్నారు. గత ఎన్నికల ముందు సంపూర్ణ మద్య నిషేధం హామీతో గద్దెనెక్కిన జగనరెడ్డి... నేడు అక్రమ సంపాదనకు మాటతప్పి, మడమతిప్పాడన్నారు. బినామీలతో నాశిర కం మద్యం తయారుచేయించి, ప్రజల ధన, మాన, ప్రాణాలను బలితీసుకుంటున్నాడని ఆగ్రహించారు. ప్రభుత్వ మద్యంలో విష రసాయనాలు ఉన్నట్లు చెన్నై ల్యాబ్ పరీక్షల్లో వెల్లడైందన్నారు. గంజాయి సరఫరాలో ఏపీ నెంబర్‌వన అని కేంద్రమంత్రి నిర్మలాసీతారామన, డీఆర్‌ఐ నివేదిక విడుదల చేసిందని అన్నారు. చివరకు కలియుగ దైవం వెంకటేశ్వరస్వామి సన్నిధిలో కూడా గంజాయిని స్వాధీనం చేసుకోవడం దౌర్భాగ్యమన్నారు. గంజాయి మత్తులో యువత జీవితాలు నాశనం అవుతాయన్నారు. జగనరెడ్డి అధికారంలోకి వచ్చాక వ్యవసాయ రంగం కుదేలై, గంజాయి సాగులో మాత్రం దేశంలోనే నెంబర్ వన స్థానంలో నిలిచిందన్నారు. సమావేశంలో నాయకులు మాధవనాయుడు, శ్రీరాము లు, గుట్టూరు సూర్యనారాయణ, ఈశ్వర్‌ప్రసాద్, టైలర్ ఆంజనేయులు, నరసింహులు, నంజప్ప, త్రివేంద్రనాయుడు, వాసుదేవరెడ్డి, మారుతి, సుబ్రహ్మణ్యం, మంజు పాల్గొన్నారు.