మూలనపడిన వైద్య పరికరాలు

ABN , First Publish Date - 2023-04-10T00:03:21+05:30 IST

పట్టణంలోని ప్రభుత్వాసుపత్రిలో రోగ నిర్ధారణ వైద్య పరికరాలు వృథాగా మారాయి. మరమ్మతుల ముసుగులో మూలనపడేశారు. దీంతో రోగులు పరీక్షల కోసం ప్రైవేట్‌ ల్యాబ్‌లను ఆశ్రయించాల్సి వస్తోంది. పేదల పరిస్థితి ద యనీయంగా మారింది.

మూలనపడిన వైద్య పరికరాలు

రోగ నిర్ధారణ పరీక్షలకు బాధితుల అవస్థలు

ప్రైవేట్‌ ల్యాబ్‌లను ఆశ్రయిస్తున్న వైనం

మరమ్మతులపై దృష్టిసారించని అధికారులు

హిందూపురం అర్బన, ఏప్రిల్‌ 9: పట్టణంలోని ప్రభుత్వాసుపత్రిలో రోగ నిర్ధారణ వైద్య పరికరాలు వృథాగా మారాయి. మరమ్మతుల ముసుగులో మూలనపడేశారు. దీంతో రోగులు పరీక్షల కోసం ప్రైవేట్‌ ల్యాబ్‌లను ఆశ్రయించాల్సి వస్తోంది. పేదల పరిస్థితి ద యనీయంగా మారింది. మరమ్మతులు చేపట్టాల్సిన అధికారులు మీ నమేషాలు లెక్కిస్తున్నారు. పేదలకు ప్రభుత్వ ఆసుపత్రిలో నాణ్య మైన సేవలు అందిస్తున్నామని చెబుతున్నా, క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది. ఆసుపత్రిలో ఉన్న యంత్రాలను పక్కన పెట్టేశా రు. రోగ నిర్ధారణ పరీక్షలకు బయటికి రెఫర్‌ చేస్తున్నారు. ప్రైవేట్‌ గా డబ్బులు వెచ్చించి పరీక్షలు చేయించలేమంటూ రోగులు గగ్గోలు పెడుతున్నారు. ఎండోస్కాపి యంత్రం ఉన్నప్పటికీ దానిని వాడకుండా మూలనపడేశారు. దీంతో సంబంధిత పరీక్షలు బయటకి రాస్తున్నారు. ఇందుకోసం దాదాపు రూ.1500 దాకా ఖర్చు అవుతు న్నదని రోగుల బంధువులు వాపోతున్నారు. విలువైన యంత్రాలు ఇలా పక్కన పడేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీటీ స్కా న యంత్రానిదీ ఇదే పరిస్థితి. ఈ యంత్రం మెయింటెనెన్స సక్రమంగా చేపట్టకపోవడంతో పాడైపోయి మూలన పడేశారు. కేవలం బ్యాటరీలు, యాసిడ్‌, ఫిల్టర్‌ వాటర్‌ తదితరాలను క్రమం తప్పకుం డా చూసుకుని ఉన్నింటే లక్షల రూపాయల విలువ చేసే సీటీ స్కా నింగ్‌ యంత్రం పాడుకాకుండా ఉండేది. రేడియాలజిస్టులు సమస్య ను చెప్పినా సంబంధిత అధికారులు పట్టించుకోలేదని తెలుస్తోంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి ధర్మాసుపత్రిలో వైద్య పరికరాల కు మరమ్మతులు చేపట్టి రోగులకు అందుబాటులోకి తీసుకురావాల ని కోరుతున్నారు.

Updated Date - 2023-04-10T00:03:21+05:30 IST