ఇసుక ట్రాక్టర్ సీజ్
ABN , First Publish Date - 2023-11-29T00:17:24+05:30 IST
మండల పరిధిలోని కల్లుమర్రి చెరువు వద్ద గంతలపల్లి నుంచి కల్లుమర్రికి ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్‌ను సీజ్ చేసినట్లు సెబ్ సీఐ భార్గ వరెడ్డి తెలిపారు.
మడకశిరటౌన, నవంబరు 28: మండల పరిధిలోని కల్లుమర్రి చెరువు వద్ద గంతలపల్లి నుంచి కల్లుమర్రికి ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్‌ను సీజ్ చేసినట్లు సెబ్ సీఐ భార్గ వరెడ్డి తెలిపారు. అక్రమంగా ఇసుక తరలిస్తున్నారన్న సమాచారం మంగళవారం రావడంతో వెంటనే అక్కడికి వెళ్లామని తెలిపారు. ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా ట్రాక్టర్లో ఇసుక తరలిస్తుం డగా సీజ్‌చేసి మడకశిర పోలీస్‌స్టేషనకు తరలించినట్లు తెలిపారు.