నాలుగేళ్లుగా పడకేసిన సచివాలయ భవన నిర్మాణాలు
ABN , First Publish Date - 2023-05-01T23:46:35+05:30 IST
గ్రామీణ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం పంచాయతీ కేంద్రంలో గ్రామ స చివాలయ వ్యవస్థను ఏర్పాటుచేసింది. పూర్తిస్థాయిలో సిబ్బందిని కూ డా నియమించారు. అయితే సచివాలయాలకు పక్కా భవనాల నిర్మాణాలను అటకెక్కించింది.
మడకశిర రూరల్, మే 1: గ్రామీణ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం పంచాయతీ కేంద్రంలో గ్రామ స చివాలయ వ్యవస్థను ఏర్పాటుచేసింది. పూర్తిస్థాయిలో సిబ్బందిని కూ డా నియమించారు. అయితే సచివాలయాలకు పక్కా భవనాల నిర్మాణాలను అటకెక్కించింది. పనులు చేపట్టి నాలుగేళ్లు కావస్తున్నా నేటికీ నిర్మాణాలు పూర్తి కాలేదు. దీంతో సిబ్బంది, కార్యాలయానికి వచ్చే ప్ర జలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మండలంలో 18 గ్రామ సచివాలయాలు, 18 రైతు భరోసా కేంద్రాలు, 18 హెల్త్ క్లినిక్ భవనాల నిర్మా ణాలు మంజూరయ్యాయి. రూ.15.96 కోట్ల నిధులు కూడా విడుదల చేశారు. ఒక్కొక్క గ్రామ సచివాలయానికి రూ.45 లక్షలు, ఆర్బీకేకు రూ.21 లక్షలు, హెల్త్‌క్లినిక్‌కు రూ.21 లక్షల చొప్పున నిధులు కేటాయిం చారు. మొదటి విడతగా నిధులు బాగా విడదలయ్యాయి. ఈనేపథ్యం లో చేసిన పనులకు బిల్లులు త్వరగా వస్తాయనే నమ్మకంతో చాలా మంది కాంట్రాక్టర్లు పనులు వేగవంతంగా చేశారు. రెండో విడత ని ధులు విడుదల చేయకపోవడంతో వెనుకడుగు వేశారు. నిర్మాణాలు అ ర్ధంతరంగా ఆపేశారు. నాలుగేళ్లవుుతున్నా పూర్తికాలేదు. కొన్ని భవన నిర్మాణాలు లింటిల్, టా్‌పలెవల్ వరకు వచ్చాయి. మరికొన్ని పునాది దశలోనే ఉండిపోయాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చాలా సచివాలయాల్లో సిబ్బందికి గదులు కొరత వేధిస్తోంది. ఈకారణంగా చిన్న చిన్న అద్దెగదులలోనే అవస్థలు పడుతూ విధులు కొనసాగిస్తున్నారు. మెళవాయి సచివాలయ భవన నిర్మాణాలు పునాదులకే పరిమితమయ్యాయి. చాలా సచివాలయ భవనాలను పంచాయతీ కేంద్రాల్లో కమ్యూనిటీ భవనాల్లో నిర్వహిస్తున్నారు. సగానికి పై గా రైతు భరోసా కేంద్రాలు అద్దె భవనాల్లో ఉన్నాయి. ఇప్పటికైనా సం బంధిత ఉన్నతాధికారులు చర్యలు తీసుకొని అరంతరంగా అగిన భవ న నిర్మాణాలు పూర్తి చేయాలని ప్రజలు కోరుతున్నారు. ఈ విషయమై సంబంధిత అధికారులను వివరణ కోరేందుకు ప్రయంత్నించగా, అం దుకు వారు స్పందించడంలేదు.