స్పీడ్‌ బ్రేకర్‌ వద్ద పలు వాహనాలు ఢీ

ABN , First Publish Date - 2023-05-20T00:16:39+05:30 IST

స్థానిక వై-జంక్షన సమీపంలో 44వ జా తీయ రహదారిపై శుక్రవారం తెల్లవారుజామున పలు వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి.

స్పీడ్‌ బ్రేకర్‌ వద్ద పలు వాహనాలు ఢీ

సోమందేపల్లి, మే 19: స్థానిక వై-జంక్షన సమీపంలో 44వ జా తీయ రహదారిపై శుక్రవారం తెల్లవారుజామున పలు వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈప్రాంతంలో అధికారులు ఇటీవలే స్పీ డ్‌ బ్రేకర్లు ఏర్పాటు చేశారు. బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న వాహనదారులు స్పీడ్‌ బ్రేకర్లను గుర్తించకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈక్రమంలో బస్సు, బొలెరో, రెండు లారీలు ఒకదానికి ఒకటి వెనుక నుంచి ఢీకొన్నాయి. సంఘటనలో ఎవరికీ ఎ లాంటి గాయాలు కాలేదు. బస్సు, బొలెరో వాహనాలు పాక్షికంగా దె బ్బతిన్నాయి. వేగంగా వచ్చే వాహనాలు స్పీడ్‌బ్రేకర్ల వద్ద నిదానంగా వెళ్లే వాహనాన్ని గుర్తించకపోవడంతోనే ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు.

రెండు ద్విచక్రవాహనాలు...

గోరంట్ల: మండలంలోని సామలపల్లి డాబా వద్ద శుక్ర వారం రెండు ద్విచక్రవాహనాలు ఢీకొన్నాయి. ప్రమాదంలో భార్యా భర్తలు అనిత, పృథ్వితేజ గాయపడ్డారు. స్థానికులు తెలిపిన వివరా లివి. బాలంపల్లి మోడల్‌స్కూల్‌లో ఉపాధ్యాయునిగా అనిత, హిం దూపురం సిరికల్చర్‌ మార్కెట్‌లో ఉద్యోగం చేస్తున్న పృథ్వితేజలకు ఇటీవల వివాహమైంది. వీరు పుట్టపర్తి మండలం పెడబల్లిలో నివాసముంటూ ప్రతిరోజూ ద్విచక్రవాహనంపై విధులకు వెళ్లి వచ్చేవా రు. ఉదయం భార్యాభర్తలు వెళ్తున్న ద్విచక్రవాహనాన్ని సామలపల్లివద్ద ఎదురుగా వస్తున్న మరో ద్విచక్రవాహనం ఢీకొంది. సంఘటనలో దంపతులిద్దరూ గాయపడగా, 108లో హిందూపురంలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన ద్విచక్రవాహనదారుడు పరారయ్యాడు.

Updated Date - 2023-05-20T00:16:39+05:30 IST