పేరొకరిది.. ఫొటో సంతకం మరొకరిది..

ABN , First Publish Date - 2023-04-03T23:58:46+05:30 IST

స్థానిక బాలికల ఉన్నత పా ఠశాలలో సోమవారం ప్రా రంభమైన ఇంటర్‌ ఓపెన పరీక్షలకు హాజరైన అభ్యర్థి ని హాల్‌టికెట్‌లో అడ్రస్‌ ఒ కరిది.. ఫొటో సంతకం మ రొకరిది ఉండటంతో పరీక్షల కు అనుమతించలేదు.

పేరొకరిది.. ఫొటో సంతకం మరొకరిది..

పెనుకొండ, ఏప్రిల్‌ 3: స్థానిక బాలికల ఉన్నత పా ఠశాలలో సోమవారం ప్రా రంభమైన ఇంటర్‌ ఓపెన పరీక్షలకు హాజరైన అభ్యర్థి ని హాల్‌టికెట్‌లో అడ్రస్‌ ఒ కరిది.. ఫొటో సంతకం మ రొకరిది ఉండటంతో పరీక్షల కు అనుమతించలేదు. ధర్మవరానికి చెందిన కొండారెడ్డిగారి ప్రియాంక ఇంటర్‌ ఓ పెన పరీక్ష రాయడానికి పె నుకొండ బాలికల ఉన్నత పాఠశాల కేంద్రానికి వచ్చింది. ఆమె తెచ్చిన హాల్‌టికెట్‌లో అ డ్రస్‌ సక్రమంగా ఉన్నా, అందులోని ఫొటో కింద సంతకం కే ప్రత్యూష అని ఉండటంతో అధికారులు పరీక్ష హాల్‌లోకి అనుమతించలేదు. చివరికి ఆమె ఆధార్‌ కార్డు వాట్సాప్‌ ద్వారా తెప్పించుకుని, అడ్రస్‌ సక్రమంగా ఉండటంతో పరీక్షలకు అనుమతించారు.

Updated Date - 2023-04-03T23:58:46+05:30 IST