టీడీపీ గెలుపు కోసం సమష్టి కృషి : శ్రీరామ్
ABN , First Publish Date - 2023-06-08T00:00:48+05:30 IST
రాబోవు ఎన్నికల్లో తెలుగుదేశంపార్టీ విజ యం కోసం అందరూ సమష్టిగా కృషిచేయాలని ధర్మవరం నియోజకవర్గ టీడీపీ ఇనచార్జి పరిటాల శ్రీరామ్ అన్నారు.
ధర్మవరం(తాడిమర్రి), జూన 7: రాబోవు ఎన్నికల్లో తెలుగుదేశంపార్టీ విజ యం కోసం అందరూ సమష్టిగా కృషిచేయాలని ధర్మవరం నియోజకవర్గ టీడీపీ ఇనచార్జి పరిటాల శ్రీరామ్ అన్నారు. బుధవారం అనంతపురంలోని పరిటాల శ్రీరామ్ నివాసంలో చిల్లవారిపల్లి గ్రామస్థులు ఆయన్ను కలిశారు. ఈసందర్భంగా ఆయన వారితో మాట్లాడుతూ... ఎన్నికలకు సమాయత్తంలో భాగంగా అందరూ కలిసికట్టుగా పనిచేయాలన్నారు. పరిటాల కుటుంబం మీకు ఎప్పుడూ అండగా ఉంటుందని సూచించారు. కార్యక్రమంలో చిల్లవారిపల్లి గ్రామస్థులతోపాటు టీడీపీ మండల కన్వీనర్ కూచిరామ్మోహన, క్లస్టర్ ఇనచార్జి నిడిగల్లు భూషణ ఉన్నారు.