తెలుగుదేశం పార్టీతోనే అభివృద్ధి

ABN , First Publish Date - 2023-01-07T00:11:19+05:30 IST

తెలుగుదేశం పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని తెలుగుదేశం పార్టీ మండల కన్వీనర్‌ జింక సూర్యనారాయణ పేర్కొన్నారు.

తెలుగుదేశం పార్టీతోనే అభివృద్ధి

అనంతపురం రూరల్‌ జనవరి 6: తెలుగుదేశం పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని తెలుగుదేశం పార్టీ మండల కన్వీనర్‌ జింక సూర్యనారాయణ పేర్కొన్నారు. శుక్రవారం మండలంలోని మన్నీల గ్రామంలో ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు ఇంటింటికి తిరుగుతూ ప్రభుత్వ వైఫల్యాలు, టీడీపీ పాలనలో జరిగిన అభివృద్ధి పనులను తెలియజేశారు. కార్యక్రమంలో క్లస్టర్‌ ఇనచార్జ్‌ రాజా మురళీమోహన, మండల ఉపాధ్యక్షులు గంగాధర్‌రెడ్డి, చల్లా వెంకటనాయుడు, కుమ్మర రామాంజినేయులు, అన్నగిరి మోహాన, భుట్రా బయన్న, అల్లు అంజి, జయప్రకాష్‌, నల్లప్ప, నారాయణస్వామి, వెంకట్రాముడు, కాటమయ్య, పుల్లన్న, ఎల్లప్ప, కుమార్‌స్వామి, ప్రవీణ్‌గౌడ్‌ పాల్గొన్నారు.

Updated Date - 2023-01-07T00:11:20+05:30 IST