ఐదోరోజుకు చేరిన అంగనవాడీల సమ్మె
ABN , Publish Date - Dec 16 , 2023 | 11:57 PM
సమస్యల పరిష్కారం కోరుతూ అంగనవాడీ కార్యకర్తలు చేపట్టిన సమ్మె శనివారం ఐదో రోజుకు చేరుకుంది.
(ఆంధ్రజ్యోతి, న్యూస్ నెట్‌వర్క్)
సమస్యల పరిష్కారం కోరుతూ అంగనవాడీ కార్యకర్తలు చేపట్టిన సమ్మె శనివారం ఐదో రోజుకు చేరుకుంది. హిందూపురం, పెనుకొండ, మడకశిర పట్టాణాలతో పాటు అన్ని మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు కొన సాగించారు. సీఐటీయూ ఆధ్వర్యంలో చేపట్టిన అంగనవాడీల ఆందోళనలకు టీడీపీ, సీపీఎం, సీపీఐ రైతు సంఘాల నాయకులు, ఆశా కార్యకర్తలు మద్దతు పలికారు. ఈ సందర్భంగా అంగనవాడీలు నల్లరిబ్బన్లు కట్టుకుని నిరసనలో పాల్గొన్నారు. కొన్ని చోట్ల నల్ల రిబ్బన్లతో పాటు మోకాళ్లపై కూర్చుని తమ నిరసన కొనసాగించారు. ఈ సందర్భంగా యూనియన నా యకులు మాట్లాడుతూ... అంగనవాడీ వర్కర్లు, ఆయాలకు జీతాలు పెంచమని పాలకులు అంటున్నారన్నారు. వారికి ఓట్లు మాత్రం కావాలి, సమస్యలు పట్టవా అని ప్రశ్నించారు. ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయని, రాబోయే ఎన్నికల్లో అధికార పార్టీకి తగిన బుద్ధి చెబుతామని హె చ్చరించారు. అంగనవాడీ కేంద్రాలకు ప్రభుత్వ ఉద్యోగులే తాళాలు పగలకొట్టిన తీరుపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు.