వైసీపీ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయ్‌..

ABN , First Publish Date - 2023-04-10T23:19:11+05:30 IST

‘మాట తప్పం.. మడమ తి ప్పమని అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి అన్నీ తిప్పేశాడు. అన్ని రకాల చార్జీలు పెంచుతున్న ఈ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయి’ అంటూ టీడీపీ నాయకులు మండిపడ్డారు.

వైసీపీ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయ్‌..

విద్యుత చార్జీల పెంపు, కోతలపై మండిపడ్డ తెలుగు తమ్ముళ్లు

ట్రాన్సకో కార్యాలయాల ఎదుట నిరసన

హిందూపురం, ఏప్రిల్‌ 10: ‘మాట తప్పం.. మడమ తి ప్పమని అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి అన్నీ తిప్పేశాడు. అన్ని రకాల చార్జీలు పెంచుతున్న ఈ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయి’ అంటూ టీడీపీ నాయకులు మండిపడ్డారు. విద్యుత చార్జీల పెంపు, కోతలను ని రసిస్తూ సోమవారం టీడీపీ ఆధ్వర్యంలో జిల్లావ్యాప్తంగా తె లుగు తమ్ముళ్లు ఆందోళనకు దిగారు. ట్రాన్సకో కార్యాలయా లు, సబ్‌స్టేషన్ల ఎదుట బైఠాయించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. హిందూపురంలోని డివిజనల్‌ ఇంజనీర్‌ కార్యాలయం వద్ద ధర్నాకు దిగారు. అంతకు ముందు కనకదాస విగ్రహం ఎదుట రోడ్డుపై బైఠాయించి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈసందర్భం గా టీడీపీ నాయకులు మాట్లాడుతూ జగన అధికారంలోకి వచ్చాక నాలుగేళ్లలో ఎనిమిదోసారి విద్యుత చార్జీలు పెంచి ప్రజల నడ్డి విరుస్తున్నారని విమర్శించారు. పేద, మధ్యతరగతి ప్రజలపై విద్యుత చార్జీల భారం గుదిబండగా మారిందన్నారు. టీడీపీ హయాంలో రూ.150లోపు వస్తున్న బిల్లు, ప్రస్తుతం రూ.400 నుంచి రూ.500 దాకా వస్తున్నదన్నారు. ఈ ప్రభుత్వంలో నిత్యావసర వస్తువులతో పాటు పెట్రోల్‌, డీజల్‌, గ్యాస్‌, విద్యుత చార్జీలు అమాంతంగా పెరిగిపోయాయన్నారు. ప్రజలు గమనిస్తున్నారని, వైసీపీకి బుద్దిచెప్పే రోజులు దగ్గరపడ్డాయన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయ కులు అంబికా లక్ష్మీనారాయణ, కొల్లకుంట అంజినప్ప, డీఈ రమేష్‌, బేవనహళ్లి ఆనంద్‌, శివశంకర్‌, నాగరాజు, అమర్‌నాథ్‌, వెంకటేశ, హెచఎన రాము, నవీన, పరిమళ, డైమండ్‌ బాబా, రాఘవేంద్ర, మంజునాథ్‌, అశ్వర్థ నారాయణరెడ్డి, నారాయణరెడ్డి, రామక్రిష్ణారెడ్డి, ఉమాశంకర్‌రెడ్డి, వెంకటరమణ, బాచి, నెట్టప్ప, అంజినరెడ్డి, జేపీకే రాము, బాబా, కార్యకర్తలు పాల్గొన్నారు.

లోటు నుంచి మిగులు తెచ్చిన

ఘనత చంద్రబాబుదే...

పెనుకొండ: రాష్ట్రంలో 2014కు ముందు 1.2 మిలియన్ల యూనిట్ల లోటు ఉన్న విద్యుతను, 2019 నాటికి మిగులు తెచ్చిన ఘనత చంద్రబాబు నాయుడుదేనని టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీకే పార్థసారథి అన్నారు. స్థానిక విద్యుత సబ్‌స్టేషన ఎదుట బీకే ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు ఆందోళ న చేపట్టారు. పార్టీ జెండాలు, బ్యానర్లు ప్రదర్శిస్తూ పార్టీ కార్యాలయం నుంచి సబ్‌స్టేషన వరకు ర్యాలీ నిర్వహించా రు. అనంతరం అక్కడే బైఠాయించారు. ఈసందర్భంగా బీకే మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం పవర్‌ ఫైనాన్స కార్పొరేషన ద్వారా అప్పులు తెచ్చి, రూ.57.188 కోట్ల భారాన్ని విద్యుత వినియోగదారులపై మోపారన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వా ల ఆధ్వర్యంలో జెన్కో, సీజీఎ్‌సలలో యూనిట్‌ విద్యుత రూ.5కే లభిస్తుందని, కానీ ప్రభుత్వ సంస్థలో విద్యుత ఉత్ప త్తి చేయకుండా కమీషన్ల కోసం బయట మార్కెట్‌లో రూ.9 లకు యూనిట్‌ కొనుగోలు చేస్తున్నారన్నారు. అనంతరం ట్రాన్సకో ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ కరుణాకరన, ఏఈ పరమేశ్వర్‌రెడ్డితో మాట్లాడారు. వేసవిలో ప్రజలకు నాణ్యమైన వి ద్యుత అవాంతరాలు లేకుండా సరఫరా చేయాలని విన్న వించారు. ట్రాన్సఫార్మర్‌ కాలిపోతే 24 గంటల్లోపు పునరుద్ధ రించాలని కోరారు. మోటార్లకు మీటర్లు బిగిస్తే పగలకొడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు మునిమడుగు వెంకటరాముడు, పోతిరెడ్డి, బాబుల్‌రెడ్డి, శ్రీ నివాసులు, అశ్వర్థప్ప, సిద్దయ్య, రవిశంకర్‌, రఘువీరచౌద రి, దారపునేని రామలింగ, గుట్టూరు సుబ్బరాయుడు, ఆదిశే షు, లక్ష్మీనారాయణరెడ్డి, నారాయణనాయక్‌, పాలడుగు చంద్ర, బోయ గాయత్రి, రమణమ్మ, హుజురుల్లాఖాన, రి యాజ్‌, జావిద్‌, సయ్యద్‌ ఇనాయతుల్లా, షఫీ, సమీ, షాకీర్‌బాషా, జెరాక్స్‌ శీన, తోటగేరి శీన, కన్నాస్వామి పాల్గొన్నారు.

సోమందేపల్లి: రాష్ట్రప్రభుత్వం ఇష్టారాజ్యంగా విద్యుత చార్జీలు పెంచుతూ సామాన్యుల నడ్డి విరుస్తున్నదని టీడీ పీ నాయకులు మండిపడ్డారు. స్థానిక సబ్‌స్టేషన ఎదుట టీడీపీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తున్నదన్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా రా ష్ట్రంలో ధరలు మండిపోతున్నాయని విమర్శించారు. వ్యవసాయ కనెక్షనలకు మీటర్లతో రైతుల మెడలకు ఉరితాళ్లు బి గిస్తున్నారన్నారు. అనంతరం ఏఈ సంజీవప్పకు వినతిప త్రం అందజేశారు. కార్యక్రమంలో నాయకులు సిద్దలింగప్ప, చంద్రశేఖర్‌, రామక్రిష్ణ, కిష్టప్ప, సూరీ, అశ్వర్థప్ప, లక్ష్మణ్ణ, జట్కా చంద్ర పాల్గొన్నారు.

రొద్దం: మండలంలోని తురకలాపట్నం సబ్‌స్టేషన ఎదు ట పెనుకొండ-పావగడ ప్రధాన రహదారిపై టీడీపీ ఆధ్వ ర్యంలో రాస్తారోకో చేశారు. ‘మోటార్లకు మీటర్లు.. రైతులకు ఉరితాళ్లు, పెంచిన చార్జీలు వెంటనే తగ్గించాలి, సైకో పోవా లి..సైకిల్‌ రావాలి’ అంటూ నినాదాలు చేశారు. ఈసందర్భం గా నాయకులు మాట్లాడుతూ పెంచిన చార్జీలను వెంటనే తగ్గించకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరిం చారు. ట్రాన్సకో యంత్రాంగాన్ని నిర్వీర్యం చేశారని విమర్శించారు. కార్యక్రమంలో నాయకులు రొద్దం నరసింహులు, సుబ్బరత్నమ్మ, చిన్నప్పయ్య, నాగేంద్ర, నరహరి, రామక్రిష్ట ప్ప, అశ్వర్థనారాయణ, హరి, వాల్మీకి చంద్రశేఖర్‌, మురళి, గోనిమేకలపల్లి ఇమాం, షన్ముఖ, తిరుపతయ్య, రాము, బాషా, మంజు, నాగరాజు, బీదానిపల్లి మంజు పాల్గొన్నారు.

లేపాక్షి: వైసీపీ ప్రభుత్వం విద్యుత చార్జీలు అధికంగా పెంచి ప్రజల నడ్డి విరుస్తున్నదని టీడీపీ మండల కన్వీనర్‌ జయప్ప విమర్శించారు. స్థానిక విద్యుత సబ్‌స్టేషన వద్ద పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏ రాష్ట్రంలోనూ లేనివిధంగా ఏపీలో విద్యుత చార్జీలను భారీగా పెంచిందన్నారు. రాష్ట్ర అభివృద్ధి మరిచి దోచుకోవడమే లక్ష్యంగా పనిచేస్తున్నారన్నారు. రాబో యే ఎన్నికల్లో ప్రజలు వైసీపీ ప్రభుత్వానికి ఓటు అనే ఆ యుధంతో బుద్దిచెబుతారన్నారు. చంద్రబాబు నాయుడు నాయకత్వంలోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు. కా ర్యక్రమంలో మండల టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

పరిగి: వైసీపీ ప్రభుత్వం మోటార్లకు మీటర్లు బిగించి రైతుల మెడకు ఉరితాళ్లు వేసారని మండల టీడీపీ నాయ కులు మండిపడ్డారు. స్థానిక సబ్‌స్టేషన ఎదుట ఆందోళన చేపట్టారు. వైసీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన నాలుగేళ్ల లో విద్యుత చార్జీలు పెంచి ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు లక్ష్మీరెడ్డి, ఈశ్వరప్ప, ఆనంద్‌, శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.

మడకశిరటౌన: తెలుగుదేశం పార్టీ హయాంలో 1.2 మి లియన యూనిట్ల విద్యుత లోటు ఉండేదని, అయినా ప్రజలపై ఒక్కరూపాయి కూడా భారం మోపలేదని నియోజకవర్గ టీడీపీ ఇనచార్జి మద్దనకుంట ఈరన్న అన్నారు. టీడీపీ నాయకులు పట్టణంలో ర్యాలీ నిర్వహించి, ఏడీ కార్యాల యం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈసందర్భంగా ఆయ న మాట్లాడుతూ లోటు నుంచి మిగులు విద్యుత తెచ్చిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. ప్రజలకు నాణ్యమైన విద్యుత అందించడంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందన్నారు. విద్యుత మోటార్లకు మీటర్లు బిగిస్తే, అందుకు మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. పెంచిన చార్జీలను వెంటనే తగ్గించాలని డిమాండ్‌ చేశారు. అనంతరం ఏడీకి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో టీడీపీ నాయకు లు ఆదినారాయణ, అశ్వర్థరామప్ప, రవిభూషణ్‌, రామాంజనేయులు, ప్రకాష్‌, రాజగోపాల్‌, మంజునాథ్‌, ఈశ్వర్‌, కిష్ట ప్ప, నాగేష్‌ పాల్గొన్నారు.

గోరంట్ల: మండలంలోని గుమ్మయ్యగారిపల్లి విద్యుత స బ్‌స్టేషన వద్ద టీడీపీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. అ క్కడే బైఠాయించి, ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన తెలియజే శారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈసం దర్భంగా నాయకులు మాట్లాడుతూ విద్యుత చార్జీలు త గ్గించి, నాణ్యమైన విద్యుత సరఫరా చేయాలని డిమాండ్‌ చేశారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టి వారి మెడ కు ఉరితాడు వేయవద్దని అన్నారు. అనంతరం ఏఈకి విన తిపత్రం అందించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు సోమశేఖర్‌, బెల్లాలచెరువు చంద్ర, అశ్వర్థరెడ్డి, రామచంద్ర, గిరి, అజ్మతుల్లా, వేణు జయరాం, ఉమర్‌ఖన, ఫిరోజ్‌, సుబ్బరాయుడు, నరసింహమూర్తి, చంద్రశేఖర్‌, నాగభూషణ, వా ల్మీకి సోము, బాలకృష్ణ, రవినాయక్‌, కుర్రోల్ల ఆదినారాయణ, వెంకటేష్‌, భరత, ప్రభాకర్‌, రంగయ్య పాల్గొన్నారు.

Updated Date - 2023-04-10T23:19:11+05:30 IST