Share News

మాయ మాటల జగన

ABN , First Publish Date - 2023-11-08T01:18:35+05:30 IST

తీవ్ర కరువు పరిస్థితులు ఉన్న నేపథ్యంలో సీఎం జగన జిల్లా పర్యటనపై రైతులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారని, కానీ జగన మాయ మాటలు చెప్పి వెళ్లిపోయారని మాజీ మంత్రి పరిటాల సునీత విమర్శించారు

మాయ మాటల జగన
భవిష్యత్తుకు బాబు గ్యారెంటీ కరపత్రాలు పంపిణీ చేస్తున్న సునీత

నాలుగు వేలు ఇచ్చేందుకు ఇంత ఖర్చా?

సీఎం టూర్‌పై మాజీ మంత్రి పరిటాల సునీత ఫైర్‌

ఆత్మకూరు నవంబరు 7: తీవ్ర కరువు పరిస్థితులు ఉన్న నేపథ్యంలో సీఎం జగన జిల్లా పర్యటనపై రైతులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారని, కానీ జగన మాయ మాటలు చెప్పి వెళ్లిపోయారని మాజీ మంత్రి పరిటాల సునీత విమర్శించారు. వస్తినమ్మా.. వెళ్తినమ్మా.. అన్నట్లుగా జగన పర్యటన సాగిందని అన్నారు. ఆత్మకూరు బీసీ కాలనీలో బాబు ష్యూరిటీ-భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా పరిటాల సునీత ఇంటింటికీ వెళ్లి మహిళలను కలిశారు. చంద్రబాబు అధికారంలోకి వస్తే అమలు చేసే మినీ మేనిఫెస్టోలోని పథకాల గురించి వివరించారు. రైతులకు పెట్టిబడి సాయం కింద ఏటా రూ.20 వేలు ఇస్తారని తెలిపారు. రైతుల ఖాతాలో నాలుగు వేల రూపాయలు వేయడానికి ఇంత ఖర్చు చేసి సభ పెట్టాలా అని ఆమె ప్రశ్నించారు. రైతు సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని భావించిన ప్రతిపక్ష నాయకులను ముందస్తుగా అరెస్టు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాషా్ట్రనికి ఎంతో మంది ముఖ్యమంత్రులు అయ్యారని, జగనలాగా ఎవరూ ప్రతిపక్ష నాయకులను ఇలా నిర్బంధించలేదని అన్నారు. కరువు పరిస్థితుల్లో జిల్లా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వారికి ఊరటనిచ్చే ప్రకటన కోసం ఎదురు చూసినా ఫలితం లేకపోయిందని అన్నారు. ఇలాంటి ముఖ్యమంత్రితో ఎలాంటి ఉపయోగం లేదని అన్నారు. విద్యుత సరఫరా సక్రమంగా లేక పంటలు ఎండుతున్నాయని, రైతులకు తగిన పరిహారం ఇవ్వాలని ప్రభుత్వానికి సూచించారు. కార్యక్రమంలో టీడీపీ మండల ఇనచార్జి బాలాజీ, నాయకులు నెట్టెం వెంకటేసులు, మండల కన్వీనర్‌ శ్రీనివాసులు ఎంపీటీసీ పారిజాతమ్మ తదితరుల పాల్గొన్నారు.

Updated Date - 2023-11-08T01:18:37+05:30 IST