వైసీపీ పాలనలో అభివృద్ధి శూన్యం

ABN , First Publish Date - 2023-07-31T00:34:05+05:30 IST

వైసీపీ పాలనలో రాష్ర్టాభివృద్ధి శూన్యమని మాజీ మంత్రి పల్లె రఘునాథ్‌ రెడ్డి విమర్శించారు. మండలకేంద్రంలో ఆదివారం స్థానిక తెలుగుయువత నాయకులు మిషన రాయలసీమపై ప్రచారం నిర్వహించారు.

 వైసీపీ పాలనలో అభివృద్ధి శూన్యం

- మాజీ మంత్రి పల్లె రఘునాథ రెడ్డి విమర్శ

-అమడగూరులో మిషన రాయలసీమపై ప్రచారం

అమడగూరు, జూలై 30: వైసీపీ పాలనలో రాష్ర్టాభివృద్ధి శూన్యమని మాజీ మంత్రి పల్లె రఘునాథ్‌ రెడ్డి విమర్శించారు. మండలకేంద్రంలో ఆదివారం స్థానిక తెలుగుయువత నాయకులు మిషన రాయలసీమపై ప్రచారం నిర్వహించారు. కార్యక్రమానికి పల్లె రఘునాథ్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై మిషన రాయలసీమ కరపత్రాలను బస్టాండ్‌ ప్రాంతంలో విడుదల చేశారు. అనంతరం వాటిని ఇంటింటికీ వెళ్లి పంచి టీడీపీ ప్రకటించిన మినీమేనిఫెస్టోపై ప్రజలకు వివరించారు. తర్వాత ఆయన మాట్లాడుతూ వైసీపీ పాలనలో రాష్ర్టాభివృద్ధి 20ఏళ్లు వెనక్కు వెళ్లిందన్నారు. రాష్ట్రం అభివృద్ధి పథంలో నడవాలంటే చంద్రబాబు సీఎం కావాలని చెప్పారు. జగన పాదయాత్రలో ప్రజలకు ఎన్నో హామీలిచ్చారని, సీఎం అయ్యాక ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని ఆరోపించారు. ముఖ్యంగా యువతకు ఉపాధి కల్పించడంలో విఫలమయ్యారని అన్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే మండలాలకు పరిశ్రమలు తీసుకువచ్చి ఉపాఽఽధి కల్పిస్తామని తెలిపారు. రానున్న ఎన్నికల్లో యువత ప్రత్యేక టీడీపీ విజయానికి కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో నియోజకవర్గ తెలుగుయువత కార్యదర్శులు అంబులెన ్స రమేష్‌, టైలర్‌ రామాంజులు, మండల అధ్యక్షుడు డేగా కృష్ణారెడ్డి, ఎస్సీ సెల్‌ మండల అధ్యక్షుడు చంద్రశేఖర్‌, బీసీ సెల్‌ ప్రధాన కార్యదర్శి మస్తానప్ప, నాయకులు మనోహర్‌ , జయప్రకా్‌షనాయుడు, వైవీ మురళి, మధుసూదనరెడ్డి, శివప్రసాద్‌రెడ్డి, బడా మహేశ్వర్‌రెడ్డి, మీసేవ సుధాకర్‌, దొడ్డెం అశోక్‌, గంగాధర్‌, ఒంటూరు ఆదినారాయణ, పవనకుమార్‌నాయక్‌, నిజాంవలి, ప్రభాకర్‌రెడ్డి, కృష్ణారెడ్డి, ఐటీడీపీ మండలాధ్యక్షుడు శ్రీనివాసులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - 2023-07-31T00:34:05+05:30 IST