AP News: ఉరవకొండ పీఎస్‌లో పవన్‌కళ్యాణ్‌పై వలంటీర్లు ఫిర్యాదు
ABN , First Publish Date - 2023-07-10T14:14:15+05:30 IST
జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌పై ఉరవకొండ పోలీస్ స్టేషన్‌లో వలంటీర్లు ఫిర్యాదు చేశారు. వలంటీర్లపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పవన్‌కళ్యాణ్‌పై చర్యలు తీసుకోవాలంటూ వలంటీర్లు కోరారు. వారాహి యాత్రలో పవన్ కళ్యాణ్ వలంటీర్లపై నిందలు వేయడం.. అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదు అని వాలంటీర్లు వ్యాఖ్యానించారు.
అనంతపురం: జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌పై (Pawan Kalyan) ఉరవకొండ పోలీస్ స్టేషన్‌లో వలంటీర్లు ఫిర్యాదు చేశారు. వలంటీర్లపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పవన్‌కళ్యాణ్‌పై చర్యలు తీసుకోవాలంటూ వలంటీర్లు కోరారు. వారాహి యాత్రలో పవన్ కళ్యాణ్ వలంటీర్లపై నిందలు వేయడం.. అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదు అని వాలంటీర్లు వ్యాఖ్యానించారు. వలంటీర్లకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. వలంటీర్లు ఏం చేస్తున్నారో.. పవన్‌కల్యాణ్ చూశారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్యాకేజీ స్టార్ పవన్ కళ్యాణ్ డౌన్ డౌన్ అంటూ వలంటీర్లు నినాదాలు చేశారు.
ఆదివారం ఏలూరు సభలో వలంటీర్లపై వ్యాఖ్యలు
‘‘ఏపీలో కనపడకుండా పోయిన 29 వేల మందికిపైగా మహిళల గురించి కేంద్ర నిఘా వర్గం ఏం చెప్పిందో తెలుసా? రాష్ట్రంలో మిస్ అయిన ఆడవాళ్ల వెనుక వలంటీర్లు ఉన్నారని..! ఒంటరిగా, భర్త లేని, బాధల్లో ఉన్న మహిళలను వెతికి పట్టుకోవడం, ట్రాప్ చేయడం, బయటకు తీసుకెళ్లడం, మాయం చేయడం ఇదే వలంటీర్ల పని’ అని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఆరోపించారు.