అప్పుల బాధతో వీఆర్‌ఓ ఆత్మహత్య
ABN , First Publish Date - 2023-04-19T00:10:06+05:30 IST
చాలీచాలని జీతంతో కు టుంబం పోషించుకోలేక, అప్పుల ఒత్తిళ్లు తట్టుకోలేక మండలంలోని కంబాలపల్లి వీఆర్‌ఓ తలారి రమే్‌ష(31) సోమవారం రాత్రి ఇంట్లో ఉరేసుకు న్నాడు.
రొద్దం, ఏప్రిల్ 18: చాలీచాలని జీతంతో కు టుంబం పోషించుకోలేక, అప్పుల ఒత్తిళ్లు తట్టుకోలేక మండలంలోని కంబాలపల్లి వీఆర్‌ఓ తలారి రమే్‌ష(31) సోమవారం రాత్రి ఇంట్లో ఉరేసుకు న్నాడు. బంధువులు, తోటి ఉద్యోగులు తెలిపిన వివరాలివి. మోపర్లపల్లికి చెందిన తలారి రమే్‌ష కు రెండేళ్ల క్రితం వీఆర్‌ఓగా ప్రమోషన రావడం తో కంబాలపల్లిలో విధులు నిర్వహిస్తున్నారు. ప్ర మోషన వచ్చిన వీఆర్‌ఓలకు ప్రభుత్వం కేవలం రూ.15వేలు మాత్ర మే ఇస్తోంది. చాలీచాలని జీతంతో కుటుంబాన్ని పోషించుకోలేక చా లాచోట్ల అప్పులు చేశాడు. అప్పులోళ్ల ఒత్తిళ్లు తట్టుకోలేక రాత్రి ఇంటిపైకప్పునకు ఉరేసుకున్నాడు. భార్య గమనించి కేకలు వేయగా, బం ధువులు వచ్చేలోపే మృత్యువాతపడ్డాడు. మృతునికి భార్య నవిత, ఏ డేళ్ల కుమారుడు, ఐదేళ్ల కుమార్తె ఉన్నారు. ఎస్‌ఐ నాగస్వామి కేసు నమోదుచేసి, మృతదేహాన్ని పెనుకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
కుటుంబ కలహాలతో హమాలీ...
సోమందేపల్లి, ఏప్రిల్ 18: మండలకేంద్రంలోని వినాయకనగర్‌లో మంగళవారం హమాలీ గోపాల్(25) ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్‌ఐ వి జయ్ కుమార్ తెలిపిన వివరాలివి. పెనుకొండ కు చెందిన గోపాల్ నాలుగేళ్ల క్రితం సోమందేపల్లికి చెందిన మాధవిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. హమాలీ పని చేసుకొని జీవనం సాగించేవాడు. కొంత కాలంగా ఇరువురి మధ్య కలహాచోటుచేసుకుంటున్నాయి. దీంతో మద్యానికి బానిసైన గోపాల్, మద్యం మత్తులో ఇంటి పైకప్పుకు చీరతో ఉరేసుకున్నాడు. భార్య గమనించే లోపే మృతి చెందాడు. పోలీసులు మృతుదేహాన్ని పోస్టుమార్టుం నిమిత్తం పెనుకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, కేసు దర్యాప్తు చేస్తున్నారు.