కౌన్సిలర్ల గోడు

ABN , First Publish Date - 2023-04-09T00:05:01+05:30 IST

స్థానిక నగర పంచాయతీలో అభివృద్ధి పడకేసింది. నిధులు లేక కాలనీల్లో సమస్యలు తాండవిస్తున్నా యి. ప్రజలకు సమాధానం చెప్పుకోలేక కౌన్సిలర్ల గోడు కన్నీరు తె ప్పిస్తోంది.

కౌన్సిలర్ల గోడు

నిధులు లేక... నీరుగారిన అభివృద్ధి

పెనుకొండ టౌన, ఏప్రిల్‌ 8: స్థానిక నగర పంచాయతీలో అభివృద్ధి పడకేసింది. నిధులు లేక కాలనీల్లో సమస్యలు తాండవిస్తున్నా యి. ప్రజలకు సమాధానం చెప్పుకోలేక కౌన్సిలర్ల గోడు కన్నీరు తె ప్పిస్తోంది. మేజర్‌ గ్రామ పంచాయతీగా ఉన్న పెనుకొండను 2019 లో నగర పంచాయతీగా అప్‌గ్రేడ్‌ చేశారు. పక్కనే ఉన్న కోనాపురం, వెంకటరెడ్డి పంచాయతీలను విలీనం చేశారు. జనాభా దృష్ట్యా వె య్యి ఓటర్లకు ఒక వార్డుగా విభజించారు. 2021లో వార్డు కౌన్సిలర్ల కు ఎన్నికలు జరిపారు. 18 వార్డుల్లో వైసీపీ, రెండు వార్డులు టీడీపీ కైవసం చేసుకున్నాయి. ఇప్పటికి ఏడాదిన్నర కావస్తోంది. ఆయా వా ర్డుల్లో సమస్యలు రాజ్యమేలుతున్నాయి. సర్వసభ్య సమావేశాల్లో కౌన్సిలర్ల మొర ఆలకించే నాథుడే లేకుండాపోయాడు. ఫలితంగా సమస్యలు ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారాయి. గెలిచిన ఆనందంలో ఆయా వార్డుల్లో అధికార పార్టీ కౌన్సిలర్లు పర్యటించి, హామీలు గుప్పించారు. తీరా హామీలు నెరవేరకపోవడంతో ప్రస్తుతం ప్రజలకు మొహం చాటేస్తున్నారు. అభివృద్ధికి నిధులు లేకపోవడంతో, అనుకున్నదొక్కటి... అయినదొక్కటి అన్న చందంగా కౌన్సిలర్లు పెదవి విరుస్తున్నారు. ఎన్నికల సమయంలో ప్రచారంలో లక్షల రూపాయలు ఖర్చుపెట్టారు. స్థానిక ఓటర్లకు హామీలు ఇచ్చి గెలిచారు. నేడు ఆయా వార్డుల అభివృద్ధికి నిధులు లేక నిరుత్సాహ పడుతున్నారు. తామంతా ఉత్సవ విగ్రహాలమేనంటూ చిన్నబుచ్చు కుంటున్నారు. చిన్న చిన్న అభివృద్ధి పనులు ప్రజలు చెబితే చేయలేకపోతున్నామని.... ఇదేం కర్మరా? అంటూ కౌన్సిలర్లు గోడు వెళ్లబో సుకుంటున్నారు. మరోవైపు నగర పంచాయతీకి సిబ్బంది కొరత వేధిస్తోంది. 20 వార్డులకు సరిపడా పారిశుధ్య కార్మికులు, వాటర్‌మనలు లేరు ఈ పరిస్థితుల్లో అభివృద్ధి తిరోగమనంలో సాగుతోంది.

తాగునీటి సమస్య అధికం

గీత, ఒకటో వార్డు టీడీపీ కౌన్సిలర్‌

తాగునీటి సమస్య అధికంగా ఉందని సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టాం. సబ్‌ కలెక్టర్‌కు వినతినందించి, మొరపెట్టుకు న్నాం. అయినా సమస్య పరిష్కారం కాలేదు. డ్రైనేజీ, రోడ్ల నిర్మాణం పడకేసింది. ప్రభుత్వ నిధులతో ఏ అభివృద్ధి పనులూ మా వార్డులో జరగలేదు.

డ్రైనేజీ సమస్యతో ఇబ్బందులు

శోభన సప్తగిరి, 3వ వార్డు టీడీపీ కౌన్సిలర్‌

డ్రైనేజీలు సక్రమంగా లేక మురుగునీరు రోడ్డుపై చేరుతోంది. సమస్యలతో వార్డు ప్రజ లు సతమతమవుతున్నారు. పలు వీధుల్లో వీ ధిదీపాలు లేక రాత్రిళ్లు చీకటి అలుముకుం టోంది. తాగునీటి సమస్య తీవ్రమైంది. సొంత డబ్బుతో అరకొర పనులు చేపట్టాం. ప్రభుత్వ నిధులతో ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టలేదు. సొంత డబ్బుతో అభివృద్ధి పనులు చేస్తే తిరిగి వస్తాయన్న నమ్మకంలేదు. ప్రభుత్వం అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి.

రూ.1.50 కోట్లతో అభివృద్ధి పనులు చేపడతాం

వంశీకృష్ణ భార్గవ్‌, కమిషనర్‌

ప్రస్తుతం దర్గాకు వచ్చే భక్తుల దృష్ట్యా ఇరువైపులా డ్రైనేజీ పనులు ఏర్పాటు చేశాం. త్వరలో రూ.1.50 కోట్లతో అభివృద్ధి పనులు చే పడతాం. మా దృష్టికి వచ్చిన సమస్యలు వెం టనే పరిష్కరిస్తున్నాం. ఆదాయం పెంచేందు కు నీటి కొళాయిలు, ఇంటి గుత్తులు సకాలంలో చెల్లించేలా చర్యలు తీసుకుంటున్నాం. ప్రజాప్రతినిధులు, పట్టణ ప్రజలు సహకరించాలి. నగర పంచాయతీలో సమస్యల పరిష్కా రానికి నిధులు మంజూరు చేస్తాం.

Updated Date - 2023-04-09T00:05:01+05:30 IST