వృథాగా వర్షపు నీరు

ABN , First Publish Date - 2023-05-21T23:57:21+05:30 IST

నియోజకవర్గం దశాబ్దాల కాలంగా క్షామపీ డిత ప్రాంతం. వర్షాభావం వెన్నాడుతూనే ఉంది. నీటి వనరుల లభ్య త గగనమైంది. జనం తాగు, సాగు నీటికి కటకటాలాడాల్సి వస్తోంది.

వృథాగా వర్షపు నీరు

అడుగంటుతున్న భూగర్భజలాలు

ఒట్టిపోతున్న చెరువులు

పూడిక, కంపచెట్ల నడుమ సప్లై చానల్‌

తాగు, సాగునీటి కోసం తల్లడిల్లుతున్న జనం

క్షామపీడిత ప్రాంతంగా మడకశిర

మడకశిర, మే 21: నియోజకవర్గం దశాబ్దాల కాలంగా క్షామపీ డిత ప్రాంతం. వర్షాభావం వెన్నాడుతూనే ఉంది. నీటి వనరుల లభ్య త గగనమైంది. జనం తాగు, సాగు నీటికి కటకటాలాడాల్సి వస్తోంది. వర్షాలు కురిసినప్పడల్లా కాలువలు, నదులు కోతకు గురికావడం, మ రో పక్క తెగిన చెక్‌డ్యాంలు, కుంటల గుండా నీరు వృథాగా పోతోంది. ఆయా ప్రాంతాల్లో నీటి తిప్పలు తప్పడం లేదు. గత యేడు భారీ వ ర్షాలు కురవడంతో కొంత ఉపవమనం లభించినట్లయ్యింది. దశాబ్దకాలంగా రైతులు సాగునీటికి ఎదురుచూడాల్సి వస్తోంది. జిల్లాకు దక్షిణా ది ప్రాంతమైన మడకశిర ఎత్తు ప్రాంతంలో ఉంది. ఫలితంగా కురిసి న వర్షపు నీరంతా దిగువ ప్రాంతంలోని కర్ణాటక చెరువులు, కుంటల కు చేరుతోంది. ఈ నీటిని సప్లైఛానళ్ల ద్వారా మళ్లించి, ఇక్కడి చెరువులు నింపేందుకు చేపట్టిన చర్యలు కార్యరూపం దాల్చలేదు. గతం లో నిధులు మంజూరైనప్పటికీ టెండర్లు, అగ్రిమెంట్ల దశలోనే నిలిచిపోతున్నాయి. మంజూరైన నిధులు కూడా వెనక్కు మళ్లిపోయాయి. అమరాపురం, గుడిబండ, మడకశిర మండలాల్లోని పలు ప్రాంతాల్లో భూగర్భజలాలు అడుగంటిపోయాయి. తాగు, సాగునీటి సమస్య తీవ్రరూపం దాల్చింది. ఎనిమిదేళ్ల క్రితం గుడిబండ, రొళ్ల మండలాల్లో వృ థాగా వెళ్తున్న నీటిని అరికట్టేందుకు వాటర్‌షెడ్‌ కింద కోట్లాది రూపాయలు వెచ్చించారు. చెక్‌డ్యాంలు, కుంటల నిర్మాణం చేపట్టారు. పలు చోట్ల చెక్‌డ్యాంలు నాసిరకంగా నిర్మించడం, మరికొన్ని చోట్ల వీటి ని ర్మాణాలు చేపట్టకనే నిధులు స్వాహా చేసిన ఉదంతాలు వెలుగు చూ శాయి. రొళ్ల మండలంలో రూ.80 లక్షల నిధులు దుర్వినియోగమైన ట్లు అప్పట్లో నిర్వహించిన సామాజిక తనిఖీల్లో వెల్లడైంది. అయితే ఆ మండలాల్లో వృథాగా వెళ్లే నీటికి అడ్డుకట్ట వేసి, భూగర్భజలాలు పెం పొందించే చర్యలు అటకెక్కాయి. రానున్న రోజుల్లో తాగు, సాగునీరు జటిలమయ్యే పరిస్థితులు దాపురిస్తున్నాయి. గత సంవత్సరం కురిసిన భారీ వర్షాలకు చెరువులు, కుంటలు నిండడంతో ఈ యేడు వేసవిలో నియోజకవర్గ వ్యాప్తంగా తాగు నీటి సమస్యకు తెరదించినట్లయ్యింది.

వెనక్కు మళ్లిన రూ.2 కోట్ల నిధులు

పదేళ్ల క్రితం అమరాపురం మండలంలో నాచేపల్లి సప్లైఛానల్‌, గుడిబండ మండలంలో మోరుబాగల్‌ సప్లైఛానళ్ల నుంచి నీటిని మన ప్రాంతంలోని చెరువులకు మళ్లించేందుకు రూ.2 కోట్ల నిధులు మంజూరయ్యాయి. అయితే రెండు దఫాలుగా టెండర్లు పిలిచారు. నిధులు మంజూరై పనులు జరగకపోవడంతో వెనక్కు మళ్లాయి. దీంతో నాచేపల్లి సప్లైఛానల్‌ నుంచి కర్ణాటకలోని దొడ్డబాణగెర చెరువుకు నీరు వె ళ్తోంది. ఆ నీటిని మళ్లిస్తే తమ్మడేపల్లి చెరువుకు నీరు చేరుతాయి. మో రుబాగల్‌ సప్లైఛానల్‌ నీరు కూడా మళ్లించకపోవడంతో దిగువ ప్రాం తంలోని కర్ణాటక చెరువులకు చేరుతున్నాయి. రొళ్ళ మండలం హొట్టేబెట్ట నుంచి గంగలవాయిపాళ్యం, గోవిందాపురం మీదుగా వచ్చే నీరు మడకశిర చెరువులకు మళ్లించేందుకు పదేళ్ల క్రితం ప్రతిపాదనలు పంపారు. నిధులు మంజూరు కాలేదు. ఈ సప్లైఛానల్‌ నీరు మడకశిర చెరువుకు మళ్లిస్తే కొద్దిపాటి వర్షం వచ్చినా చెరువుకు నీరు చేరుతుంది. దీంతో భూగర్భజలాలు పెరిగి నీటి సమస్య పరిష్కారం కావడంతో పా టు మడకశిర పట్టణానికి తాగునీటి సమస్య తీరుతుంది. ఆ నీటిని మ ళ్లించకపోవడం కారణంగా వర్షాలు అంతంత మాత్రంగానే కురవడం, చెరువులకు నీరు చేరకపోవడంతో ఆయకట్టు బీడుగా మారింది. ని యోజకవర్గ కేంద్రానికి తాగునీరు అందించే బోర్లు ఒట్టిపోయాయి.

వృథాగా స్వర్ణముఖి నది నీరు...

అగళి మండలంలో స్వర్ణముఖి నది గత యేడు కురిసిన వర్షాలకు పొంగిపొర్లింది. పలు ప్రాంతాల్లో నది గట్టు కోతకు గురైంది. కొద్దిపాటి వర్షం వచ్చినా నీరంతా వృథాగా పోతోంది. ఈ సప్లైఛానళ్ల మరమ్మతు లు చేపట్టి, ఈ ప్రాంత చెరువులకు మళ్లిస్తే శాశ్వతంగా తాగునీటి స మస్య పరిష్కారమవుతుంది. రొళ్ల మండలం కొడగార్లగుట్ట కాలువలో పూడిక పేరుకుపోయింది. కంపచెట్లు పెరిగి నీరు ముందుకు వెళ్లని దుస్థితి. దీంతో నీరంతా వృథా అవుతోంది. పూడిక, కంపచెట్లు తొలగిస్తే వర్షపు నీరు రొళ్ల చెరువుకు చేరతుంది. ఆప్రాంతంలో తాగు, సాగు నీటి సమస్య పరిష్కారమవుతుందని రైతన్నలు అంటున్నారు.

కొడగార్లగుట్ట సప్లయ్‌ చానల్‌ పూడిక తొలగించాలి

విశ్వనాథ్‌, రైతు, రొళ్ల

కొడగార్లగుట్ట సప్లయ్‌ ఛానల్‌ పూడిక, కంపచెట్లు తొలిగించాలి. ఈకాలువ ద్వారా రొళ్ల చెరువుకు పుష్కలంగా నీరు చేరుతాయి. నీరంతా వృథాగా పోతోంది. వర్షాలు కురిసినా చెరువుకు నీరు రావడంలేదు. తాగు, సాగు నీటికి ఇబ్బందులు పడాల్సి వస్తోంది. పూడిక తొలగింపును అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకుండా పోయింది. ఇప్పటికైనా చర్యలు చేపట్టాలి.

నిధులు మంజూరైన వెంటనే పనులు చేపడతాం

శ్రీనివాసులు, ఇరిగేషన ఏఈ

కాలువల నుంచి చెరువులకు నీరు అందించేందుకు గతంలో ప్రతిదిపాదనలు పంపాం. నిధులు మంజూరు కాలేదు. కొన్నింటికి నిధు లు మంజూరైనా, పనులు చేయడానికి ముందుకు రాకపోవడంతో వెనక్కు మళ్లాయి. నిధులు మంజూరైతే వెంటనే పనులు చేపడతాం.

Updated Date - 2023-05-21T23:57:21+05:30 IST