భారతను విశ్వగురువుగా నిలబెడతాం: బీజేపీ
ABN , First Publish Date - 2023-04-07T00:03:33+05:30 IST
భారతదేశాన్ని విశ్వగురువుగా నిలబెట్టాలనే బలమైన తలంపుతో మోదీ ప్రభుత్వం ముందుకు సాగుతున్నదని బీజేపీ నాయకులు పేర్కొన్నారు.
హిందూపురం అర్బన, ఏప్రిల్ 6: భారతదేశాన్ని విశ్వగురువుగా నిలబెట్టాలనే బలమైన తలంపుతో మోదీ ప్రభుత్వం ముందుకు సాగుతున్నదని బీజేపీ నాయకులు పేర్కొన్నారు. గురువారం స్థానిక సూగూరు ఆలయ సర్కిల్‌లో ఆపార్టీ 44వ ఆవిర్బావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. జెండా ఆవిష్కరించి నాయకులు మాట్లాడారు. రాబోవు ఎన్నికలకు బూత కమిటీలను బలోపే తం చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో నాయకులు పార్థసార థి, ఆదర్శ్‌కుమార్, వరప్రసాద్, టీకే బాబు, శంకర్, తిరుమలేష్, న గేష్, దివాకర్‌నాయుడు, అమర్, దేవేంద్ర, లక్ష్మీనారాయణ, రాము, బద్రీ, మహేష్, మోహన, కిష్టప్ప, ఉదయ్, అశోక్ పాల్గొన్నారు.
రొద్దం: మండలకేంద్రంలో గురువారం బీజేపీ ఆవిర్భావ దినోత్స వం సందర్భంగా నాయకులు పార్టీ జెండా ఆవిష్కరించారు. దేశం లో అతిపెద్ద జాతీయ పార్టీగా ఆవిర్భవించి, అంచెలంచెలుగా అభివృద్ధి పథంలో నడిపిస్తున్నదన్నారు. కార్యకర్తల త్యాగాలను స్మరించుకుంటూ, వారి స్ఫూర్తితో పార్టీని బలోపేతం చేయాలని సూచించారు. కార్యక్రమంలో నాయకులు వేణుగోపాల్, నారాయణరెడ్డి, గం గాధరప్ప, మహదేవ్, పవన, రవిశంకర్, తిప్పేస్వామి, మనోహర్, గోపాల్, ప్రకాశ పాల్గొన్నారు.
మడకశిర టౌన: భారతీయ జనతాపార్టీ ఆవిర్భావ దిననోత్సవా న్ని గురువారం పట్టణంలో ఘనంగా నిర్వహించారు. నాయకులు మాట్లాడుతూ భారతీయుల ఆకాంక్షలను నెరవేర్చడానికి అనుక్షణం విలువలతో కూడిన రాజకీయాలు చేస్తూ, పేదల సంక్షేమం కోసం శ్రమిస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ అన్నారు. అనేక మంది నాయకులు చిత్తశుద్ధి, అంకిత భావంతో పనిచేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో నాయకులు చంద్రశేఖర్, నాగరాజు, కేఎన పురుషోత్తం, సుబ్బరాయుడు, చంద్రశేఖర్‌రెడ్డి, గుప్తా పాల్గొన్నారు.