‘భవిష్యత్తుకు గ్యారెంటీ’ పథకాలు ప్రజల్లోకి తీసుకెళతాం’
ABN , First Publish Date - 2023-06-12T00:16:31+05:30 IST
టీడీపీ ప్రభుత్వం మినీ మేనిఫెస్టోలో ప్రకటించిన ‘భవిష్యత్తుకు గ్యారెంటీ’ సంక్షేమపథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని మండల టీడీపీ కన్వీనర్ కరణం ప్రభాకర్ పార్టీ శ్రేణులకు సూచించారు.
ముదిగుబ్బ, జూన 11: టీడీపీ ప్రభుత్వం మినీ మేనిఫెస్టోలో ప్రకటించిన ‘భవిష్యత్తుకు గ్యారెంటీ’ సంక్షేమపథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని మండల టీడీపీ కన్వీనర్ కరణం ప్రభాకర్ పార్టీ శ్రేణులకు సూచించారు. ఆదివారం మండలంలోని సంకేపల్లిలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు మహానాడులో ప్రకటించిన మహాశక్తి పథకం, రైతులకు అన్నదాత పథకం, నిరుద్యోగులకు నిరుద్యోగభృతి తదితర పథకాలను ప్రజలకు వివరించాలన్నారు. సమావేశంలో టీడీపీ నాయకులు కనుమ చంద్ర, సూర్యశేఖర్, మహబూబ్‌పీరా, త్రిలోక్, ఆనంద్, చల్లా రంగయ్య, దాడితోట భాస్కర్, సూరి, నాయుడు, గణపర్తి నారాయణస్వామి, కూచి శేఖర్, పోతలయ్య, శేఖర్, రాజగోపాల్ పాల్గొన్నారు.