మహిళ ఆత్మహత్య
ABN , First Publish Date - 2023-04-30T00:16:00+05:30 IST
మండలంలోని శిరివరం గ్రామానికి చెందిన రత్నమ్మ(54) కుటుంబ కలహాలతో మనస్తాపం చెంది బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది.
లేపాక్షి, ఏప్రిల్ 29: మండలంలోని శిరివరం గ్రామానికి చెందిన రత్నమ్మ(54) కుటుంబ కలహాలతో మనస్తాపం చెంది బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఘటన శనివారం వెలుగుచూసింది. స్థానికులు తెలిపిన వివరాలివి. రత్నమ్మ కుటుంబ కలహాలతో మూ డు రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయింది. కుటుంబ సభ్యులు ప లుచోట్ల గాలించినా, ఆచూకీ లభించలేదు. ఈక్రమంలో గ్రామ సమీ పంలోని బావి వద్ద దుర్వాసన రావడంతో పశువులకాపర్లు మృతదే హాన్ని గుర్తించారు. పోస్ట్‌మార్టం నిమిత్తం హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.