రోడ్డు నిర్మాణం పూర్తయినా తప్పని తిప్పలు

ABN , First Publish Date - 2023-04-19T00:05:27+05:30 IST

సోమందేపల్లి-కొత్తపల్లి క్రాస్‌ రోడ్డు నిర్మాణం పూర్తయినా వాహనచోదకులకు మాత్రం తిప్పలు తప్పడం లేదు. ఇటీవలే ఈరోడ్డు పనులు పూర్తిచేశారు. డివైడర్‌ వెడ ల్పు ఎక్కువ విస్తీర్ణంలో నిర్మాణం చేపట్టారు. దీంతో వాహనచోదకులు పాట్లు పడుతున్నారు.

రోడ్డు నిర్మాణం పూర్తయినా తప్పని తిప్పలు

సోమందేపల్లి, ఏప్రిల్‌ 18: సోమందేపల్లి-కొత్తపల్లి క్రాస్‌ రోడ్డు నిర్మాణం పూర్తయినా వాహనచోదకులకు మాత్రం తిప్పలు తప్పడం లేదు. ఇటీవలే ఈరోడ్డు పనులు పూర్తిచేశారు. డివైడర్‌ వెడ ల్పు ఎక్కువ విస్తీర్ణంలో నిర్మాణం చేపట్టారు. దీంతో వాహనచోదకులు పాట్లు పడుతున్నారు. గతంలో గతుకుల రోడ్డుతో ఇబ్బందులు పడ్డామ ని, ప్రస్తుతం కొత్త రోడ్డు పూర్తయినా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోతోందని వాపోతున్నారు. డివైడర్‌ వెడల్పు అధికంగా ఉండటంతో ఈప్రాంతంలో వాహనాలు మలుపు తిరిగేందుకు ఇబ్బందికరంగా మా రుతోంది. అంతేకాక దుకాణాల ఎదుట రోడ్డుపైనే వాహనాలు నిలుపుతున్నారు. ఈపరిస్థితుల్లో బస్సులు, ఇతర భారీ వాహనాల డ్రైవర్లు ఇ బ్బందులు పడుతున్నారు. పెద్దమ్మగుడి సర్కిల్‌ వద్ద రోడ్డు నిర్మాణం పూర్తయినా బస్సు షెల్టర్‌ నిర్మించలేదు. ప్రయాణికులు మండే ఎండ ల్లో చెట్ల కింద, దుకాణాల ఎదుట నిలబడి బస్సుల కోసం ఎదురుచూడాల్సి వస్తోంది. రోడ్డు నిర్మాణ సమయంలో ఉన్న డ్రైనేజీని తొలగించా రు. నూతన డ్రైనేజీ నిర్మించకపోవడంతో మురుగునీరు సమీపంలోని ఇళ్ల వద్ద నిల్వ ఉంటోంది. అధికారులు స్పందించి ఎన్టీఆర్‌ సర్కిల్‌ వద్ద డ్రైనేజీ ఏర్పాటుచేసి, డివైడర్‌ వెడెల్పు తగ్గించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.

Updated Date - 2023-04-19T00:05:27+05:30 IST