నగరంలో యువగళం సంఘీభావ యాత్ర

ABN , First Publish Date - 2023-04-03T00:12:47+05:30 IST

నారాలోకేశ యువగళం పాదయాత్రకు సంఘీభావంగా ఆదివారం అనంతపురం నగరంలో తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లింగారెడ్డి ఆధ్వర్యంలో యాత్ర నిర్వహించారు.

 నగరంలో యువగళం సంఘీభావ యాత్ర

పోలీసుల ఆంక్షలను లెక్కచేయకుండా హాజరైన యువత

అనంతపురం అర్బన, ఏప్రిల్‌ 2: నారాలోకేశ యువగళం పాదయాత్రకు సంఘీభావంగా ఆదివారం అనంతపురం నగరంలో తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లింగారెడ్డి ఆధ్వర్యంలో యాత్ర నిర్వహించారు. సంఘీభావ యాత్రకు పోలీసులు ఆంక్షలు విధించారు. వీటిని లెక్కచేయకుండా టీడీపీ శ్రేణులు హాజరయ్యారు. స్థానిక పాతూరులోని బ్రహ్మంగారి ఆలయం నుంచి బసన్నకట్ట, సప్తగిరి సర్కిల్‌, క్లాక్‌ టవర్‌ మీదుగా ఆర్ట్స్‌ కళాశాల సమీపంలోని ఎన్టీఆర్‌ విగ్రహం దాకా యాత్ర కొనసాగింది. అనంతర ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన గౌస్‌మొద్దీన, లింగారెడ్డి మాట్లాడుతూ.. అనంత ఉమ్మడి జిల్లాలో నారాలోకేశ యువగళం పాదయాత్రకు అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందగా హాజరై మద్దతునిస్తున్నారన్నారు. యువగళం పాదయాత్రకు విశేష ప్రజాస్పందన చూస్తుంటే రాబోవు ఎన్నికల్లో టీడీపీదే విజయమని స్పష్టమవుతోందన్నారు. టీడీపీ తిరిగి అధికారం లోకి వస్తేనే అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందని వారు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో రంగా, వెంకటరామయ్య, సైఫుద్దీన, పవన, ఫిరోజ్‌, జాఫర్‌, మణిరవి, గోపాల్‌, రఫి, సురేష్‌, రాము, కృష్ణారెడ్డి, సుమలత, డిష్‌ ప్రకాష్‌, మంజునాథ్‌ పాల్గొన్నారు.

Updated Date - 2023-04-03T00:12:47+05:30 IST