యువకుడి ఆత్మహత్య
ABN , First Publish Date - 2023-05-28T23:39:37+05:30 IST
స్థానికంగా నివాసముంటున్న సంజీవరెడ్డి కుమారుడు సాయికుమార్(27) ఉ ద్యోగం రాలేదని మనస్తాపం చెంది శనివారం రా త్రి ఇంట్లో ఉరేసుకున్నాడు.
పరిగి, మే 28: స్థానికంగా నివాసముంటున్న సంజీవరెడ్డి కుమారుడు సాయికుమార్(27) ఉ ద్యోగం రాలేదని మనస్తాపం చెంది శనివారం రా త్రి ఇంట్లో ఉరేసుకున్నాడు. ఏఎ్‌సఐ హిదాయతు ల్లా తెలిపిన వివరాలివి. సాయుకుమార్ రెండేళ్ల క్రితం ఎంబీఏ పూర్తిచేశాడు. పలు కంపెనీల్లో ఉ ద్యోగం కోసం ప్రయత్నించినా ఫలితం లేకపో యింది. దీంతో మనస్తాపం చెంది ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంటి పైకప్పునకు ఉరేసుకున్నాడు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమి త్తం హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
కళాశాలలో చేర్పించలేదని...
మడకశిరటౌన(అమరాపురం), మే 28: కోరుకున్న కళాశాలలో చేర్పించలేదని అమరాపురం మండలం హలుకూరు గ్రా మానికి చెందిన మోహితసూర్య(18) ఆదివారం ఉరేసుకున్నాడు. ఎస్‌ఐ వెంకటేశ్వర్లు తెలిపిన వివరాలివి. సూర్యప్రకాష్, మంజుళ దంపతుల కుమారుడు మోహితసూర్య ఇం టర్మీడియట్ పూర్తిచేశాడు. ఇంజనీరింగ్ వి ద్యాభ్యాసానికి బెంగళూరులో చేర్చాలని తల్లి వద్ద ఒత్తిడి తెచ్చాడు. తండ్రి వీఆర్‌ఏగా పనిచేస్తూ ఇటీవల మృతి చెందాడు. ఆర్థిక సమస్యలతో స్థానికంగానే విద్యనభ్యసించాలని తల్లి కోరింది. దీంతో మనస్తాపం చెందిన మోహితసూర్య ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకున్నాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.