AP Election Commissioner : ఏపీలో నకిలీ ఓట్ల చేరికపై సీఈసీ సీరియస్.. అర్జంటుగా ఢిల్లీకి రావాలంటూ ఈసీకి ఆదేశం..

ABN , First Publish Date - 2023-07-11T12:47:51+05:30 IST

అర్జెంట్‌గా ఢిల్లీకి రావాలని.. ఏపీ ఎన్నికల కమిషనర్ ముఖేశ్ కుమార్ మీనాకు కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. ఏపీలో భారీగా ఓట్ల గల్లంతు, నకిలీ ఓట్ల చేర్పులపై సీఈసీకి ఫిర్యాదులు వెల్లువెత్తాయి.

AP Election Commissioner : ఏపీలో నకిలీ ఓట్ల చేరికపై సీఈసీ సీరియస్.. అర్జంటుగా ఢిల్లీకి రావాలంటూ ఈసీకి ఆదేశం..

ఢిల్లీ : అర్జెంట్‌గా ఢిల్లీకి రావాలని.. ఏపీ ఎన్నికల కమిషనర్ ముఖేశ్ కుమార్ మీనాకు కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. ఏపీలో భారీగా ఓట్ల గల్లంతు, నకిలీ ఓట్ల చేర్పులపై సీఈసీకి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఏపీలో నకిలీ ఓట్ల చేర్పులపై సీఈసీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఈ క్రమంలోనే అర్జంటుగా ఢిల్లీకి రావాలంటూ ముఖేష్ కుమార్ మీనాకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఆయన హుటాహుటిన ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. ఏపీ ఓటర్ల జాబితాతో పాటు ముఖ్యమైన ఫైళ్లను కూడా తీసుకురావాలని ముఖేశ్ కుమార్ మీనాకు సీఈసీ ఆదేశాలు జారీ చేశారు. సీఈసీ రాజీవ్ కుమార్‌తో ముఖేశ్ కుమార్ మీనా మధ్యాహ్నం భేటీ కానున్నారు.

Updated Date - 2023-07-11T12:47:51+05:30 IST