Home » Election Commission of India
రాజ్యసభలో ఖాళీ అయిన స్థానాలకు ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలయింది. ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ నుంచి పెద్దల సభలో అడుగు పెట్టిన మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు, ఆర్ కృష్ణయ్యలు తమ తమ పదవులకు రాజీనామా చేశారు. అలాగే ఒడిశా, పశ్చిమ బెంగాల్‌తోపాటు హర్యానాలో రాజ్యసభ ఉప ఎన్నికలు జరగనున్నాయి.
ఎన్నికల స్వేచ్ఛగా, సజావుగా జరిగేలా చూడాలని రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ అధికారి, ఆయా జిల్లాల ఎన్నికల అధికారులు, రిటర్నింగ్ అధికారులను ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ ఆదేశించారు. ఫిర్యాదులు అందిన తక్షణమే చర్యలు తీసుకోవాలని, తీసుకున్న చర్యలను ఫిర్యాదుదారుని ట్యాగ్ చేస్తూ సోషల్ మీడియాలో తెలియజేయాలని కూడా ఆయన ఆదేశాలు ఇచ్చారు
జార్ఖాండ్, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు, ఉప ఎన్నికల్లో స్టార్ క్యాంపెయినర్లు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినట్టు నవంబర్ 11న బీజేపీ ఫిర్యాదు చేసినట్టు ఖర్గేకు రాసిన లేఖలో ఈసీ తెలిపింది. ఇదే తరహాలో నడ్డాకు కూడా ఈసీ లేఖ రాసింది.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల వేళ తమను మాత్రమే లక్ష్యంగా చేసుకుని తనిఖీలు చేస్తున్నారంటూ కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ)పై ప్రతిపక్ష పార్టీలు విమర్శలు చేస్తున్న నేపథ్యంలో శుక్రవారం ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది.
ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల తుది దశ ప్రచారంలో రాజకీయ రగడ చోటు చేసుకుంది. రాహుల్‌గాంధీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌కు అనుమతులు ఇవ్వడంలో 45 నిమిషాలపాటు ఆలస్యం జరిగింది.
బ్యాగ్ తనిఖీకి ఈసీ అధికారులు రావడంతో థాకరే ప్రశ్నలు కురిపించడం వీడియోలో కనిపిస్తోంది. ముందు తమను తాము పరిచయం చేసుకోమని థాకరే వారిని అడగంతో పాటు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్‌షా, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ బ్యాగ్‌లు ఇలాగే చెక్ చేస్తారా? అంటూ అధికారులను ప్రశ్నించారు.
రాజకీయ పార్టీలు, అభ్యర్థులు తమ ప్రచారంలో మహిళలను కించపరచేలా వ్యవహరించకుండా అధికారులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సీఈసీ సూచించారు. వ్యక్తిగత జీవితాలపై విమర్శలు కూడదని, రాజకీయ ప్రత్యర్థులపై దిగజారుడు వ్యాఖ్యలు చేయరాదని అన్నారు.
అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో మహారాష్ట్ర డీజీపీ రష్మీ శుక్లాను బదిలీ చేస్తూ ఎన్నికల సంఘం సోమవారం ఆదేశాలు జారీ చేసింది.
విపక్షాల పట్ల డీజీపీ పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారంటూ మహా వికాస్ అఘాడిలో కీలక భాగస్వామిగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈసీకి వరుస ఫిర్యాదులు చేసింది. అక్రమ ఫోన్ టాపింగ్‌కు ఆమె పాల్పడ్డారంటూ గత నెలలో ఫిర్యాదు చేసింది.
నవంబర్ 13వ తేదీన పలు సామాజిక, సాంస్కృతిక, మతపరమైన కార్యక్రమాలు ఉన్నందున ఆరోజు ఎన్నికలు నిర్వహించడం వల్ల ఓటింగ్ శాతం తగ్గే అవకాశం ఉందని, తేదీని మార్చాలని బీజేపీ, కాంగ్రెస్, బీఎస్పీ, ఆర్ఎల్డీ సహా పలు రాజకీయ పార్టీలు, సామాజిక సంస్థల ప్రతినిధుల నుంచి విజ్ఞప్తులు వచ్చినట్టు ఈసీఐ తెలిపింది.