IRR Case: చంద్రబాబు పిటిషన్‌పై హైకోర్టులో విచారణ వాయిదా
ABN , Publish Date - Dec 14 , 2023 | 08:04 PM
IRR Case: అమరావతిలోని ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో గురువారం విచారణ జరిగింది. సీఐడీ తరఫున ఏజీ శ్రీరామ్ వాదనలు పూర్తి చేశారు. చంద్రబాబు తరఫు న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపించారు.
అమరావతిలోని ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో గురువారం విచారణ జరిగింది. సీఐడీ తరఫున ఏజీ శ్రీరామ్ వాదనలు పూర్తి చేశారు. చంద్రబాబు తరఫు న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపించారు. అయితే ఆయన పూర్తి స్థాయిలో వాదనలు వినిపించలేకపోయారు. లూథ్రా వాదనలు కొనసాగించేందుకు ఈ కేసులో తదుపరి విచారణను వచ్చే సోమవారానికి హైకోర్టు వాయిదా వేసింది.
కాగా ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో అనేక అక్రమాలు జరిగాయని ఏపీ సీఐడీ అధికారులు చంద్రబాబుపై కేసులు నమోదు చేశారు. ఐఆర్‌ఆర్ వ్యవహారంలో క్విడ్ ప్రోకో జరిగిందని న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఉద్దేశపూర్వకంగానే సీఐడీ అక్రమ కేసు పెట్టిందని టీడీపీ ఆరోపిస్తోంది. ఈ కేసులో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని చంద్రబాబు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.