Home » Chandra Babu
మహిళలకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మరో శుభవార్త అందించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలకు ఈనెల 8వ తేదీ నుంచి కుట్టు శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేయబోతున్నట్టు తెలిపారు.
‘కార్యకర్తలను చూస్తే నాకు కొండంత ధైర్యం వస్తుంది. 8 నెలలుగా పాలనలో నిమగ్నమై పార్టీ శ్రేణులతో సమావేశం కాలేకపోయా. మళ్లీ కుటుంబ సమానులైన కార్యకర్తలను కలుసుకోవడం సంతోషంగా ఉంది’ అని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు అన్నారు.
వైసీపీ, జగన్ కుట్ర రాజకీయాలతో జాగ్రత్తగా ఉండాలని, అప్రమత్తంగా లేకపోవడం వల్లే 2019 ఎన్నికల్లో నష్టపోయామని చంద్రబాబు వ్యాఖ్యానించారు. టీడీఎల్పీ సమావేశంలో జగన్ కుట్ర సిద్దాంతాలను చంద్రబాబు సవివరంగా చెప్పారు. ఎమ్మెల్యేలు పాల్గొన్న ఈ సమావేశంలో సీఎం పలు విషయాల గురించి సూచనలు చేశారు.
వైజాగ్ కుర్రాడైన నితీష్ టీమిండియాలో స్థానం సంపాదించుకున్న తక్కువ కాలంలోనే అద్భుతమైన ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. ఆస్ట్రేలియాలో జరిగిన టెస్ట్ సిరీస్‌లో సెంచరీ సాధించి సత్తా చాటాడు. దీంతో నితీష్ కుమార్ రెడ్డి క్రేజ్ ఎక్కడికో వెళ్లిపోయింది.
ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశంతో రాత్రికిరాత్రి అధికారులు వేసిన బోరుబావితో ఆ పేద రైతు జీవితంలో వెలుగు నిండింది. ‘జై చంద్రబాబు.. జై జై చంద్రబాబు అన్న అసంకల్పిత నినాదం ఆయప్ప నోటివెంట వెలువడింది.
సీఎం చంద్రబాబు రాయదుర్గం నియోజకవర్గ ప్రగతికి బాటలు వేసేలా వరాల జల్లు కురిపించారు. స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు సమర్పించిన వినతిపత్రంలో పొందుపరిచిన అంశాలన్నింటికీ సానుకూలంగా స్పందించారు. ప్రజా వేదిక మీదుగా ఆయన పలు హామీలు ఇచ్చారు. నేమకల్లు-ఉంతకల్లు మధ్యలో ఐదు టీఎంసీల సామర్థ్యంతో ప్రతిపాదించిన రిజర్వాయర్‌ను నిర్మిస్తామని హామీ ఇచ్చారు. భైరవానతిప్ప ప్రాజెక్టుకు జీడిపల్లి నుంచి కృష్ణజలాలను ...
ఎన్నికల ప్రచార సభల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడమే ఽధ్యేయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ముందుకెళుతున్నారని జిల్లా ఇన్చార్జి మంత్రి ఎం.రాంప్రసాద్‌రెడ్డి అన్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడితో మాజీ సీఎం, బీజేపీ నాయకుడు ఎన్ కిరణ్ కుమార్ రెడ్డి భేటీ అయ్యారు. ఆదివారం హైదరాబాద్‌లో జూబ్లీహిల్స్‌లోని సీఎం చంద్రబాబు నివాసంలో ఆయనతో మాజీ సీఎం కిరణ్ కుమార్ సమావేశమయ్యారు. మరోవైపు సీఎం చంద్రబాబు సోమవారం ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. అయితే ప్రస్తుత సీఎంతో మాజీ సీఎం భేటీపై సర్వత్ర ఆసక్తి నెలకొంది.
మండల పరిధిలోని హనకనహాళ్ రామాలయ ఉత్సవ రథానికి దుండగులు నిప్పు పెట్టారు. సోమవారం అర్ధరాత్రి చోటు చేసుకున్న ఈ ఘటన జిల్లాలో కలకలం రేపింది. గ్రామానికి చెందిన మూలింటి ఎర్రిస్వామి రెడ్డి కుటుంబ సభ్యులు రూ.19 లక్షలు వెచ్చించి మూడేళ్ల క్రితం రథాన్ని తయారు చేయించి పురాతన రామాలయానికి సమర్పించారు. రథాన్ని భద్రపరిచేందుకు ఆలయ ప్రాంగణంలో రేకుల షెడ్డు ఏర్పాటు చేశారు. ఉత్సవాల సమయంలో రథాన్ని గ్రామంలో ఊరేగించి, యథాస్థానంలో..
వరద బాధితుల కోసం అనేక మంది దాతలు ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు ఇస్తున్నారు. గురువారం అమరావతి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉండవల్లి నివాసంలో మంత్రి లోకేశ్‌ను కలిసి విరాళాల చెక్కులను అందజేశారు. ఆ దాతల్ని సీఎం చంద్రబాబు, లోకేశ్ అభినందించారు.