Gudivada Amarnath : పురంధేశ్వరీ.. మీరు బీజేపీ అధ్యక్షులా..? లేక బాబుగారి జనతా పార్టీ అధ్యక్షులా..!?

ABN , First Publish Date - 2023-07-28T21:39:36+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌లో అధికార, ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయ్.! ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పురంధేశ్వరి (Purandeswari ).. వైసీపీపై (YSR Congress) ఓ రేంజ్‌లో విరుచుకుపడుతున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక వైఎస్ జగన్ (YS Jagan) చేసిన అప్పులు, కేంద్రం ఇచ్చిన నిధులపై లెక్కలు తీసి మరీ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు..

Gudivada Amarnath : పురంధేశ్వరీ.. మీరు బీజేపీ అధ్యక్షులా..? లేక బాబుగారి జనతా పార్టీ అధ్యక్షులా..!?

ఆంధ్రప్రదేశ్‌లో అధికార, ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయ్.! ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పురంధేశ్వరి (Purandeswari ).. వైసీపీపై (YSR Congress) ఓ రేంజ్‌లో విరుచుకుపడుతున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక వైఎస్ జగన్ (YS Jagan) చేసిన అప్పులు, కేంద్రం ఇచ్చిన నిధులపై లెక్కలు తీసి మరీ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. ఇది రుచించని వైసీపీ మంత్రులు మీడియా ముందుకొచ్చి విషం కక్కుతున్నారు.! తాజాగా ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ (Gudivada Amarnath) మీడియాతో మాట్లాడుతూ.. పురంధేశ్వరి, చంద్రబాబుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.


gudivada-Amarnath.jpg

ఏ పార్టీకి అధ్యక్షులు..?

చంద్రబాబు స్క్రిప్ట్‌లా బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి మాటలున్నాయి. చంద్రబాబు పార్టీని గెలిపించడానికి పురంధేశ్వరి తాపత్రయ పడుతున్నారు. రాష్ట్రానికి అన్యాయం జరుగుతోందని పురంధేశ్వరి దుష్ప్రచారం చేస్తున్నారు. మాయలపకీరు మరిది.. చంద్రబాబు (Chandrababu) ట్రాప్‌లో పడొద్దు..!. మళ్లీ బాబు ఉచ్చులో పడితే మీ భర్తలానే మీ రాజకీయ చరిత్ర ముగిసిపోతుంది. దగ్గుబాటి వారు మరో పుస్తకం రాయాల్సిన పరిస్థితి తేవద్దు. మీరు బీజేపీ అధ్యక్షులా..? లేక బాబుగారి జనతా పార్టీ అధ్యక్షులా..?. మీరు మాట్లాడుతున్నది.. బాబు స్క్రిప్టులా ఉంది. బాబు హయాంలోనే చిత్తూరు మేయర్‌ని చాంబర్‌లోనే చంపేశారు. అప్పుడు ఎందుకు అరాచకం అని మాట్లాడలేదు. తండ్రిగారు పెట్టిన, మరిదిగారు నడుపుతున్న పార్టీ కోసం ఎందుకంత ఆరాటం..?. అదే పార్టీకి అధ్యక్షులు అయ్యి నేరుగా రాజకీయాలు చేయవచ్చుగా..?. కూతురిగా మీకు ఆ హక్కు, వారసత్వం కూడా ఉంది కదా..?. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మద్యం నుంచి ఆదాయం రావట్లేదా..?. మీరు కేంద్రం నుంచి ఇస్తుందెంత..? మేం రాష్ట్రం నుంచి కడుతున్న పన్నులెంత..?. ఉత్తరాదికి, దక్షిణాది రాష్ట్రాలకిచ్చే నిధుల తేడాపై చర్చిద్దామా..?. విశాఖ ఉక్కుపై ఎందుకు స్పందించలేదమ్మా చిన్నమ్మా..?. రాష్ట్ర ప్రభుత్వం నుంచి రేపే భూములు ఇప్పిస్తా..? పాత వాల్తేర్‌ రైల్వే జోన్‌ ఇస్తామని ప్రకటించండి. విశాఖ నుంచే పదేళ్లు ప్రత్యేక హోదా అన్నారుగా..ఏదీ ఎక్కడ..?. ఆదాయం పెరగడం అంటే పేదవాడి జీవన శైలి మారడమే. రాష్ట్రంలో పేదరికం తగ్గుతున్న తీరు నీతిఆయోగ్ లెక్కలే చెప్తున్నాయి. రాష్ట్రానికి వస్తున్న పరిశ్రమలూ ఒక్కటీ మీకు కనిపించడం లేదా..?అని పురంధేశ్వరిపై మంత్రి అమర్నాథ్‌ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఎక్కడా లేని పథకాలు ఏపీలో అమలవుతున్నాయని.. ప్రజలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నామని మంత్రి తెలిపారు.

9purandeswari.jpg

ఎవరి మాటలు నమ్మాలి..?

అప్పులపై కేంద్రం నుంచి డేటా తీసుకోండి.. మీ మరిది గారి నుంచి కాదు. చిన్నమ్మ గారు మాజీ కేంద్ర మంత్రి.. కిషన్‌ రెడ్డి గారు మంత్రిగా ఉన్నారు కదా. ఆయన మొన్న తెలంగాణలో మాట్లాడేటప్పుడు ఆయన పక్క రాష్ట్రంలో 20 లక్షల ఇళ్లు నిర్మిస్తున్నారు. తెలంగాణ వారు ఆ రాష్ట్రాన్ని చూసి బుద్ధి తెచ్చుకోండి అన్నారు. మరి ఆయన లెక్కలు తీసుకోవాలా..? నిన్న కాక మొన్న పదవి తీసుకున్న చిన్నమ్మ మాట నమ్మాలా..?. దేశంలోనే 20 శాతం నిర్మాణాలు ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే జరుగుతున్నాయి. మేం పేదవారికి 31 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వడం వల్లే అది సాధ్యమైంది. రాష్ట్ర ప్రభుత్వం అప్పు తీసుకోవాలన్నా...రూపాయి ఖర్చు పెట్టాలన్నా రికార్డు ఉంటుంది. ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రతి పైసా ఖర్చు పెడుతున్నామని వారు తెలుసుకోవాలి. ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతానికి వెనుకబడిన ప్రాంతాల నిధులు వస్తే వాటిని వేరే చోట ఖర్చు పెట్టిన వ్యక్తి ఆమె మరిదిగారు. అప్పుల్లో టాప్‌ 5 రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌ ఉందా..? ఒక్క పైసా కూడా వృథాగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టదు. కేంద్రం నుంచి డేటా తీసుకుని చూస్తే ఇవన్నీ తెలుస్తాయి.. మరిది గారి నుంచి డేటా తీసుకుని చదివితే ఇవన్నీ ఏం తెలుస్తాయి..? అని పురంధేశ్వరిపై మంత్రి అమర్నాథ్ ప్రశ్నల వర్షం కురిపించారు.

Updated Date - 2023-07-28T21:40:07+05:30 IST