Home » AP BJP
Purandeswari: మోదీ ప్రధానమంత్రి అయిన నాటి నుంచే అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లారని బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి వ్యాఖ్యానించారు. ఈనెల 14వ తేదీన అంబేడ్కర్ జయంతి సందర్భంగా బూత్ లెవల్లో కార్యక్రమాలు చేపట్టామని దగ్గుబాటి పురంధేశ్వరి పేర్కొన్నారు.
జగన్ పోలీసులపై హేయ వ్యాఖ్యలు చేశారని పురందేశ్వరి తీవ్రంగా స్పందించారు. మహిళా పోలీసుల మనోభావాలు దెబ్బతీసినందుకు ఆయన వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు
Sujana Chowdary: పదేళ్ల నుంచి దేశం కోసం ప్రధానమంత్రి నరేంద్రమోదీ కష్టపడుతున్నామని విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరి తెలిపారు. ప్రపంచంలో ఎక్కువ మంది కార్యకర్తలు కలిగిన పార్టీ బీజేపీ అని సుజనా చౌదరి చెప్పారు.
Purandeswari: ట్రిపుల్ తలాక్‌ను తొలగించి ముస్లిం మహిళలకు మోదీ ప్రభుత్వం స్వేచ్చను ఇచ్చిందని బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి తెలిపారు. మోదీ సారథ్యంలో ఎన్డీఏ కూటమి అసాధ్యాలను సుసాధ్యం చేసిందని అన్నారు. వక్ఫ్ సవరణ చట్టం బిల్లును కూడా లోక్‌సభ, రాజ్యసభల్లో ఆమోదించారని తెలిపారు. ముస్లింల గురించి అందరూ మాట్లాడటమే తప్ప.. వారి క్షేమం కోసం కృషి చేసిన ఘనత మోదీ ప్రభుత్వానిదేనని పురంధేశ్వరి ఉద్ఘాటించారు.
AP BJP: బీజేపీ ఏపీ జిల్లాల అధ్యక్షులను పార్టీ హై కమాండ్ ప్రకటించింది. ఈ మేరకు ఈ జాబితాను మంగళవారం నాడు విడుదల చేశారు. ఈ మేరకు కొత్తగా ప్రకటించిన జిల్లా అధ్యక్షులకు రాష్ట్ర బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి అభినందనలు తెలిపారు. కార్యకర్తలను కలుపుకుని నేతలు ముందుకు వెళ్లాలని పురంధేశ్వరి పిలుపునిచ్చారు.
మదనపల్లె నియోజకవర్గంలో ప్రజల మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్య మివ్వాలని ఎమ్మెల్యే షాజహానబాషా అధికారులకు సూచించారు.
వినాయక చవితి పండుగను పురస్కరించుకుని పార్వతి తనయుడు గణనాథుడికి ప్రజలు భక్తిశ్ర ద్ధలతో పూజలు చేస్తున్నారు.
గత వైసీపీ ప్రభుత్వం ఐదేళ్ల సమయంలో విద్యుత సబ్స్టేషన్లు గురించి పట్టించుకోకుండా ఎన్నికల సమయంలో హడావిడిచేసి చివరికి చేతులెత్తేసిన వైనం తంబళ్లపల్లె నియోజక ర్గంలో చోటుచేసుకుంది.
ప్రజా సమస్యలు పరిష్కరించడంలో బీజేపీ ముందుంటుందని, అందుకే ప్రజలు ముడోసారి మోదీని ప్రధానిని చేశారని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు, రామమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. ఎప్పటికప్పుడు సమస్యలు పరిష్కరించి పేదల పక్షాన నిలుస్తుంది కాబట్టే మూడోసారి తమ పార్టీకి పట్టం కట్టారని ఆమె చెప్పారు.
వికసిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా ఏపీలోని కూటమి ప్రభుత్వం, కేంద్రంలోని మోదీ ప్రభుత్వం పనిచేస్తున్నట్లు ఏపీ బీజీపీ అధికార ప్రతినిధి లంకా దినకర్ అన్నారు. ఏపీ అభివృద్ధే లక్ష్యంగా ఇటీవల జరిగిన కేంద్ర క్యాబినెట్ సమావేశంలో మంత్రివర్గం నిర్ణయాలు తీసుకున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు.