BJP: రాష్ట్రస్థాయి సమస్యలు గుర్తించేలా బీజేపీ ఛార్జి‌షీట్ కమిటీ ఏర్పాటు

ABN , First Publish Date - 2023-04-26T19:12:15+05:30 IST

వైసీపీ (YCP) ప్రభుత్వ విధానాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లేలా ఛార్జిషీట్ పేరుతో కార్యక్రమాన్ని బీజేపీ (BJP) ప్రారంభించింది.

BJP: రాష్ట్రస్థాయి సమస్యలు గుర్తించేలా బీజేపీ ఛార్జి‌షీట్ కమిటీ ఏర్పాటు

అమరావతి: వైసీపీ (YCP) ప్రభుత్వ విధానాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లేలా ఛార్జిషీట్ పేరుతో కార్యక్రమాన్ని బీజేపీ (BJP) ప్రారంభించింది. గ్రామ, మండల, నియోజకవర్గం, జిల్లా, రాష్ట్ర స్థాయి సమస్యలను గుర్తించేలా ఛార్జి షీట్ కమిటీ ఏర్పాటు చేసింది. 11 మంది సభ్యుల బృందం ఆధ్వర్యం లోఆయా ప్రాంతాల్లో సమస్యలు, వాటి పరిష్కారాలపై ప్రత్యేక దృష్టి పెట్టింది. సీఎం జగన్ (CM Jagan) చేసిన మోసాలు, చెప్పిన అబద్దాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లేలా కార్యాచరణ రూపొందించారు. బీజేపీ ఛార్జిషీట్ కమిటీ సభ్యులను బీజేపీ ఎపీ అధ్యక్షులు సోము వీర్రాజు ప్రకటించారు. మార్గదర్శకులుగా దగ్గుబాటి పురంధరేశ్వరి, వై.సత్యకుమార్, కన్వీనర్‌గా పి.వి.యన్ మాధవ్, సభ్యులుగా.. సీఎం రమేష్, జీవియల్ నరసింహారావు, వాకాటి నారాయణ రెడ్డి, కొత్తపల్లి గీత, ఐ.వై.ఆర్. కృష్ణారావు, పి.డి. పార్దసారధి, నిమ్మక జయరాజు, వి.శ్రీనివాసబాబులను నియమించారు.

Updated Date - 2023-04-26T19:12:15+05:30 IST