YCP: హరీష్‌రావు సంచలన వ్యాఖ్యలకు బొత్స కౌంటర్ వార్నింగ్
ABN , First Publish Date - 2023-04-12T21:04:21+05:30 IST
జోన్లు, స్ధానికత అంశంపై సమావేశం నిర్వహించామని మంత్రి బొత్స సత్యనారాయణ (Botcha Satyanarayana) తెలిపారు.
అమరావతి: జోన్లు, స్ధానికత అంశంపై సమావేశం నిర్వహించామని మంత్రి బొత్స సత్యనారాయణ (Botcha Satyanarayana) తెలిపారు. ఒక డ్రాఫ్ట్ తయారు చేశామని, త్వరలోనే ఉద్యోగులతో చర్చించి క్యాబినెట్‌లో పెడతామన్నారు. రాష్ట్రపతి ఉత్తర్వుల సవరణ అంశంపై సచివాలయంలో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా బొత్స మాట్లాడుతూ... హరీష్ రావు (Harish Rao) రాజాకీయాల కోసం ఏదైనా మాట్లాడతాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. హరీష్‌రావుకు ఏం సంబంధం ఏపీ గురించి మాట్లాడడానికి? అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర అభివృద్ధిపై మాట్లాడడానికి హరీష్‌రావు ఎవరు? అని బొత్స ప్రశ్నించారు. బాధ్యత గల వ్యక్తులు బాధ్యత గుర్తెరిగి మాట్లాడాలని సూచించారు. ‘‘మా రాష్ట్రం గురుంచి మాకు తెలుసు మీ రాష్ట్రం మీరు చూసుకోండి’’ అని అన్నారు. చంద్రబాబు (Chandrababu) ఏం ఉద్ధరించారని గతంలో ఆయన చేసిన ఒక్క అభివృద్ధి చెప్పమనండన్నారు. వైఎస్, జగన్ (Jagan) హయాంలో చేసినవి తాను చెబుతానన్నారు. రైతులకు, సామాన్యులకు, పేదల కోసం ఏం చేశామో చెబుతానని పేర్కొన్నారు.