Home » Botcha Satyanarayana
సాగునీటి సంఘాల ఎన్నికలను కూటమి నేతలు అపహాస్యం చేస్తున్నారని, అందుకే ఎన్నికలను తమ పార్టీ బహిష్కరిస్తోందని వైసీపీ సీనియర్ నాయకుడు, శాసన మండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ అన్నారు.
విశాఖపట్టణంలో ఎంతోమంది సీనియర్ నాయకులు ఉన్నప్పటికీ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఉమ్మడి విశాఖపట్టణం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణను ప్రకటించడం సొంత పార్టీ నేతలనే ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ పలువురు ఉపాధ్యాయుల వద్ద వేల కోట్ల రూపాయలు వసూల్ చేశారని తెలుగుదేశం పార్టీ పార్లమెంటు అధ్యక్షులు గండి బాబ్జి (Gandi Babji) సంచలన ఆరోపణలు చేశారు. టీచర్లను వారు కోరుకున్న ప్రాంతాలకు ట్రాన్స్‌ఫర్ చేస్తామని మాయ మాటలు చెప్పి బొత్స వసూలు చేశారని ఆరోపణలు వస్తున్నాయన్నారు.
జీతాల పెంపు, గ్రాట్యూటీ డిమాండ్లతో ఆంధప్రదేశ్‌లో అంగన్‌వాడీ సమ్మె కొనసాగుతున్న వేళ మంత్రి బొత్స సత్యనారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నెలా రెండు నెలల్లో ఎన్నికలకు వెళుతున్న దశలో ఇప్పటికిప్పుడు కోర్కెలు తీర్చలేమని అన్నారు. తెలంగాణా ప్రభుత్వం అంగన్‌వాడీలకు జీతాలు పెంచిన ప్రతిసారీ తాము జీతాలు పెంచుతామని చెప్పలేదని వ్యాఖ్యానించారు.
వైసీపీకి ఎందుకు ఓటు వేయకూడదో ఒక్క మాట చెప్పాలని ఏపీ మంత్రి, వైసీపీ కీలక నేత బొత్స సత్యనారాయణ అన్నారు. అనేక పథకాలు, హాస్పిటల్స్, పాఠశాలల్లో మార్పలు చూస్తే తమ పాలన ఏంటో తెలుస్తుందని అన్నారు.
విశాఖ: రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలియకుండా మాట్లాడు తున్నారని, తెలియక పోతే ట్యూషన్ చెప్పించుకోవాలని, కావాలంటే తాను ట్యూషన్ చెబుతానని మంత్రి వ్యాఖ్యానించారు.
బైజూస్ సంస్థ(Byjus Company) ఉచితంగానే కంటెంట్ ఇస్తోందని విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ(Minister Botsa Satyanarayana) వ్యాఖ్యానించారు.
విశాఖపట్నం: విశాఖలో ఉపాధ్యాయ దినత్సవం జరుపుకోవడం సంతోషంగా ఉందని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. గతంలో ఇతర రాష్ట్రాల విద్య వ్యవస్థ గురించి మాట్లాడుకునే వారని, ఇప్పుడు దేశం మొత్తం ఏపీ రాష్ట్ర విద్య వ్యవస్థ గురించి మాట్లాడుకుంటున్నారని అన్నారు.
ఉన్నత విద్యాశాఖలో మరో రెండు కొత్త బోర్డుల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధంచేశారు. ఇప్పటికే ఉన్నత విద్యామండలి నిధులన్నీ దారిమళ్లిస్తున్నారనే ఆందోళనలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా మరో రెండు బోర్డులు ఏర్పాటుచేసి వాటికి భారీగా నిధులు వెచ్చించనున్నారు.
విజయవాడ: సినీ పరిశ్రమ ఒక పిచ్చుక అని ఒప్పుకున్నారా? చిరంజీవి చెప్పాలని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. మంగళవారం ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ ఏపీలో సంక్షేమ పథకాలు అందరికీ అందుతున్నాయన్నారు.