Janasena: జనసైనికులకు పవన్ల్యాణ్ బహిరంగ లేఖ
ABN , First Publish Date - 2023-04-24T21:25:54+05:30 IST
జనసైనికులకు జనసేన (Janasena) అధినేత పవన్ల్యాణ్ (Pawankalyan) బహిరంగ లేఖ రాశారు.
అమరావతి: జనసైనికులకు జనసేన (Janasena) అధినేత పవన్ల్యాణ్ (Pawankalyan) బహిరంగ లేఖ రాశారు. ‘‘ఏపీ అభివృద్ధి, ప్రజా శ్రేయస్సు కోసం మనం శ్రమిస్తున్నాం. మన దృష్టి మళ్లించడానికి కొన్ని శక్తులు పనిచేస్తున్నాయి. వాటిని అర్థం చేసుకుని పార్టీ శ్రేణులు ముందుకెళ్లాలి. ఆధారాలు లేకుండా ఎవరిపైనా ఆర్థిక నేరారోపణలు చేయొద్దు. జనసేన మిత్రపక్షాలలో చిన్నా చితక నేతలు ఎవరైనా.. మనపై ఏమైన విమర్శలు చేస్తే పట్టించుకోవద్దు. అవి ఆ నాయకుడి వ్యక్తిగత విమర్శలుగా భావించాలి. వాటిని ఆయా పార్టీలకు ఆపాదించవద్దు.’’ అని పవన్ కల్యాణ్ లేఖలో పేర్కొన్నారు.