Vikeka Murde Case: వివేకా హత్య కేసులో మరో కీలక పరిణామం
ABN , First Publish Date - 2023-06-07T17:23:53+05:30 IST
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి (YS Vivekananda reddy) హత్యకేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది.
హైదరాబాద్: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి (YS Vivekananda reddy) హత్యకేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. వివేకా హత్య సమయంలో లభ్యమైన లేఖపై నిన్ హైడ్రిన్ పరీక్షకు కోర్టు అనుమతి ఇచ్చింది. ఈ టెస్ట్‌తో లేఖపై ఉన్న వేలిముద్రలను గుర్తించనున్నారు. వివేకా లేఖపై వేలిముద్రలు గుర్తింపునకు నిన్ హైడ్రిన్ టెస్ట్ నిర్వహించనున్నారు. నిన్ హైడ్రిన్ పరీక్షకు అనుమతి ఇవ్వొద్దని నిందితులు పేర్కొన్నారు. నిన్ హైడ్రిన్ పరీక్షకు అభ్యంతరం లేదని అప్రూవర్ దస్తగిరి తెలిపారు. ఇదిలావుండగా.. వివేకా హత్య జరిగిన స్థలంలో ఈ లేఖ లభించింది. ఈ లేఖను అధికారులు ఫోరెన్సిక్‌కు పంపారు. అయితే ఈ లేఖను ఒత్తిడిలో రాసినట్టు సీఎఫ్ఎస్ఎల్ నివేదికలు తేల్చాయి. దీంతో లేఖపై ఉన్న వేలిముద్రలు గుర్తించాలని సీబీఐ నిర్ణయించింది.