AP NGO: 12వ పీఆర్సీ ప్రకటించినందుకు సీఎం జగన్‌కు కృతజ్ఞతలు

ABN , First Publish Date - 2023-06-09T13:56:22+05:30 IST

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డితో ఏపీ ఎన్టీవో నేతలు శుక్రవారం భేటీ అయ్యారు. బండి శ్రీనివాస్, శివారెడ్డి తదితర ఉద్యోగ సంఘాల నేతలు సీఎంను కలిశారు.

AP NGO: 12వ పీఆర్సీ ప్రకటించినందుకు సీఎం జగన్‌కు కృతజ్ఞతలు

అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డితో (CM YS Jaganmohan Reddy) ఏపీ ఎన్టీవో నేతలు (AP NGO Leaders) శుక్రవారం భేటీ అయ్యారు. బండి శ్రీనివాస్, శివారెడ్డి తదితర ఉద్యోగ సంఘాల నేతలు సీఎంను కలిశారు. అనంతరం ఏపీ ఎన్టీవో అధ్యక్షుడు బండి శ్రీనివాస్ మాట్లాడుతూ.. కేబినెట్‌లో 12వ పీఆర్సీ ప్రకటించినందుకు సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలిపామన్నారు. ఉద్యోగులకు రావాల్సిన రాయితీలు ఇచ్చే విషయంలో సమస్యలను పరిష్కరిస్తామని సీఎం చెప్పారని అన్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల సర్వీసులను క్రమబద్ధీకరించడంలో కృషి చేసిన మంత్రివర్గ సభ్యులు సీఎస్ జవహర్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. కాంట్రాక్ట్ ఉద్యోగులు 25 ఏళ్లుగా పనిచేసినా చనిపోతే మట్టి ఖర్చులు ఇవ్వలేని పరిస్థితి గతంలో ఉందన్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్దీకరించినందుకు సీఎంకు ధన్యవాదాలు తెలియజేశారు. ఏపీ వైద్య విధాన పరిషత్ లాంటి సంస్థ సహా మెడికల్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేసే ఉద్యోగులకు 010 ద్వారా ఇచ్చేలా సీఎం చర్యలు తీసుకున్నారన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల బకాయిలను 36 విడతల్లో ఇచ్చేలా చర్యలు తీసుకున్నారన్నారు. అన్ని జిల్లాల్లో ఒకే హెచ్‌ఆర్‌ఏ ఇచ్చినందుకు సీఎంకు ధన్యవాదాలు తెలిపారు.

జీపీఎస్ ద్వారా పింఛన్ ఇస్తామని సీఎం చెప్పారన్నారు. ఉద్యోగుల నుంచి కాంట్రిబ్యూషన్‌లేని పింఛన్ ఇవ్వాలని సీఎంను కోరామని.. అయితే కాంట్రిబ్యూషన్ లేని విధానం వల్ల ప్రభుత్వానికి భారమవుతుందని సీఎం చెప్పారన్నారు. తాము ప్రభుత్వానికి అమ్ముడు పోలేదని స్పష్టం చేశారు. సీపీఎస్ రద్దు చేసే వరకు పోరాడతామని.. వెనుకాడేది లేదని తేల్చిచెప్పారు. రాష్ట్ర ప్రభుత్వానికి తాము సహకరిస్తున్నామని.. కాంట్రిబ్యూషన్ లేని విధానాన్ని తీసుకు వచ్చేలా కృషి చేస్తామని చెప్పారు. భవిష్యత్తులో కాంట్రిబ్యూషన్‌ను కూడా తీసేస్తామని ప్రభుత్వం చెప్పొచ్చని వ్యాఖ్యలు చేశారు. జీపీఎస్‌లో ఈ మేరకు ఉద్యోగులతో ప్రభుత్వం అగ్రిమెంట్ చేసుకుంటుందన్నారు. జీపీఎస్‌లో ఉద్యోగికి నష్టం జరిగినా ప్రభుత్వానిదే బాధ్యత అని చెప్పారన్నారు. పీఆర్సీ ఛైర్మన్ నియామకంపై సీఎం వద్ద చర్చ జరగలేదని.. పీఆర్సీ ఛైర్మన్‌గా ఎవరిని నియమించినా తమకు అభ్యంతరం లేదని ఏపీ ఎన్టీవో అధ్యక్షుడు బండి శ్రీనివాస్ పేర్కొన్నారు.

Updated Date - 2023-06-09T13:56:22+05:30 IST