Home » YS Jagan Mohan Reddy
పేదల బతుకుపై దెబ్బ కొట్టిన వ్యక్తి జగన్ అని బీజేపీ అధికార ప్రతినిధి యామినీ శర్మ ఆరోపించారు. జగన్ పాలనలో అన్ని వ్యవస్థల్లోనూ అవినీతి రాజ్యమేలిందని విమర్శించారు. మహిళలు, యువత, రైతులు, శ్రామికులు అన్ని రంగాల్లో అబివృద్ధి చెందాలనేది మోదీ లక్ష్యమని తెలిపారు.
రాష్ట్రంలో అన్ని లిఫ్ట్లు ప్రస్తుతం శిథిలావస్థలో ఉన్నాయని మంత్రి నిమ్మల రామానాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. తాళ్లూరు లిప్ట్కు సంబంధించి పీఎస్సీ పైపుల స్థానంలో ఎమ్మెస్ పైపుల ఏర్పాటుకు అంచనాలు రూపొందిస్తున్నామని మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు.
వైఎస్ జగన్, షర్మిల మధ్య ఆస్తుల తగాదాలు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారాయి. ఇప్పుడు హాట్ టాపిక్ అంతా ఇదే విషయం నడుస్తోంది. వారసత్వ హక్కుగా రావాల్సిన ఆస్తిని చెల్లికి దక్కకుండా జగన్ వ్యవహరిస్తున్న తీరుపై ప్రజలందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు సభలో సీరియస్ కామెంట్స్ చేశారు. తప్పుడు నివేదికలు ఇచ్చిన అధికారులపై చర్యలు తీసుకోవాలని స్పీకర్ ఆదేశించారు. ఒక అధికారిపై చర్యలు చేపడితే మిగిలిన అధికారులు ఇలా చేయరని ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు హెచ్చరించారు.
ఏపీలో మరో భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ఈ స్కాం పై అసెంబ్లీలో చర్చ జరిగింది. మంత్రి సత్యకుమార్ యాదవ్ అరబిందో సంస్థపై సంచలన ఆరోపణలు చేశారు. 108 సేవ ముసుగులో భారీ దోపిడీకి పాల్పడిందని ఆరోపించారు.
వైసీపీ ఎమ్మెల్సీలకు హోంమంత్రి వంగలపూడి అనిత శాసన మండలిలో మాస్ వార్నింగ్ ఇచ్చారు. వైసీపీ సభ్యులకు ధీటుగా సభలో అనిత సమాధానమిచ్చారు. అయితే మంత్రి అనిత వ్యాఖ్యలకు నిరసనగా వైసీపీ సభ్యులు వాకౌట్ చేశారు
ఐదేళ్లలో టిడ్కో ఇళ్లను ఎందుకు పూర్తి చేయలేదని ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వంలో పేదలకు చాలా నష్టం జరిగిందని ఆరోపించారు.
జగన్ ప్రభుత్వం చివరకు చిన్న పిల్లల చిక్కీల్లోనూ రూ.175 కోట్లు బకాయిలు పెట్టిందని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. రహదారులకు రూ.810 కోట్లు కూటమి ప్రభుత్వంలో కేటాయించినట్లు తెలిపారు. ఒకటో తేదీన ఉద్యోగలకు జీతం అనేది మర్చిపోయిన ఉద్యోగులకు మేలు చేశామని మంత్రి పయ్యావుల ఉద్ఘాటించారు.
సీఎం చంద్రబాబుకు ఏపీహైకోర్టు ఎంప్లాయూస్ అసోసియేషన్ ప్రతినిధులు లేఖ రాశారు. హైకోర్టు విభజన సమయంలో, తక్కువ వ్యవధిలో, తెలంగాణ నుంచి ఉద్యోగులందరూ కుటుంబాలను విడిచిపెట్టి ఆంధ్ర ప్రదేశ్కు వచ్చారని తెలిపారు.
రఘురామ ఏదైనా ఫ్రాంక్గా మాట్లాడతారని.. ఆయనకు కల్మషం ఉండదు ముందు, వెనుక చూడకుండా మాట్లాడుతారని సీఎం చంద్రబాబు తెలిపారు. ఎక్కడైనా తప్పులు ఉన్నప్పడు కుండబద్దలు కొట్టినట్లుగా రఘురామ చెబుతారని.. అదే ఆయనకు ఇబ్బందులు తెచ్చిందని రఘురామ గురించి సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు.