Pattabhi: పట్టాభికి బెయిల్
ABN , First Publish Date - 2023-03-03T19:17:07+05:30 IST
టీడీపీ నేత పట్టాభి (Pattabhi)కి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఆయనతో అరెస్టయిన టీడీపీ నేతలకు కూడా ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక న్యాయస్థానం బెయిల్ (Bail) ఇచ్చింది.
విజయవాడ: టీడీపీ నేత పట్టాభి (Pattabhi)కి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఆయనతో అరెస్టయిన టీడీపీ నేతలకు కూడా ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక న్యాయస్థానం బెయిల్ (Bail) ఇచ్చింది. పట్టాభిని కస్టడీకి ఇవ్వాలని పోలీసులు దాఖలు చేసిన పిటిషన్ (Petition)ను తిరస్కరించిన కోర్టు.. 25 వేల రూపాయల పూచీకత్తుతో పట్టాభిని బెయిల్‌పై విడుదల చేయాలని ఆదేశాలిచ్చింది. అయితే పట్టాభితో సహా ఈ కేసులో నిందితులుగా ఉన్న టీడీపీ నేతలు 3 నెలల పాటు ప్రతి గురువారం పోలీస్ స్టేషన్‌లో హాజరుకావాలని కోర్టు నిబంధన పెట్టింది.
సీఐ కనకారావుతోపాటు ఎమ్మెల్యే వంశీ ముఖ్య అనుచరుడు గొన్నూరు సీమయ్య ఇచ్చిన ఫిర్యాదుల మేరకు పట్టాభితోసహా పలువురు టీడీపీ నేతలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీతోసహా హత్యాయత్నం కేసులు నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్లు 143, 147, 341, 333, 307 కింద కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం పట్టాభితోపాటు నిందితులంతా రాజమండ్రి (Rajahmundry) కేంద్ర కారాగారంలో ఉన్నారు. గన్నవరంలో జరిగిన ఘటనలకు సంబంధించి నమోదు చేసిన మూడు కేసుల్లో 13 మందిని పోలీసులు నిందితులుగా చూపించారు.