Home » Gannavaram
గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అక్రమాలు తవ్వేకొద్దీ వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. కృష్ణా జిల్లా, గన్నవరం రాజీవ్ కాలనీలో కోట్ల రూపాయలు విలువ చేసే ప్రభుత్వ స్థలాన్ని వైసీపీ నాయకులు కబ్జా చేశారు. దీనిని ఆ కాలనీకి చెందిన యువకులు అడ్డుకున్నారు.
AP Highcourt: గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. వంశీ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను ధర్మాసనం కొట్టివేసింది.
కృష్ణా జిల్లా: గన్నవరంలోని లిటిల్ లైట్స్ అనాథాశ్రమంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు చిన్నారులు గాయపడ్డారు. సోమవారం అర్ధరాత్రి సమయంలో విద్యార్థులు నిద్రిస్తుండగా ఆశ్రమంలోని ఓ గదిలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
YSRCP Leaders: గన్నవరం పోలీస్‌స్టేషన్‌లో ఇద్దరు వైఎస్సార్సీపీ నేతలు పోలీసుల ఎదుట లొంగిపోయారు. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పోలీసులు అరెస్ట్ చేయడంతో.. ఒక్కొక్కరుగా వైసీపీ నేతలు పోలీసుల ఎదుట లొంగిపోతున్నారు.
ముఖ్యంగా ఆయనకు గుండెకాయలాంటివాడైన ఓలుపల్లి మోహన రంగారావు అలియాస్ రంగా పేరు ఈ కేసులో ప్రముఖంగా వినిపిస్తోంది.
గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో డీటీపీ ఆపరేషన్ సత్యవర్ధన్.. పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసును వెనక్కి తీసుకోవాలని వైసీపీ నేత వల్లభనేని వంశీ అతని అనుచరులు సత్యవర్ధన్‌ను కిడ్నాప్ చేశారని ఆరోపణలు వచ్చాయి.
గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి కేసులో వల్లభనేని వంశీ సహా మొత్తం 88 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. టీడీపీ కార్యాలయంలో పనిచేస్తున్న సత్యవర్ధన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు అయ్యింది. అయితే రెండ్రోజుల క్రితం హఠాత్తుగా సత్యవర్ధన్ కేసును వెనక్కి తీసుకున్నారు.
Vijayawada: గన్నవరం ఎయిర్‌పోర్టులో విమానాలు చక్కర్లు కొడుతుండటంతో ప్రయాణికులు భయాందోళనకు గురవుతున్నారు. విమానాశ్రయం మొత్తాన్ని పొగమంచు కమ్మేసింది. దీంతో ల్యాండింగ్‌కు సిగ్నల్ అందక ఎయిర్ ఇండియా, ఇండిగో విమానాలు గాల్లోనే చక్కర్లు కొడుతున్న పరిస్థితి.
YCP Leaders: గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వైసీపీ నేతలకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. ట్రైయిల్ కోర్టులో వెళ్లాలంటూ వారికి స్పష్టం చేసింది.
కృష్ణా: ఉమ్మడి కృష్ణా, ఏలూరు జిల్లాలను పొగమంచు కమ్మేసింది. పొగమంచు కారణంగా గన్నవరం విమానాశ్రయానికి రావాల్సిన పలు విమాన సర్వీసులు ఆలస్యం కానున్నాయి. హైదరాబాద్ నుంచి వచ్చిన ఇండిగో విమానం గన్నవరం ఎయిర్పోర్ట్ వద్ద గాలిలో చక్కర్లు కొట్టింది. ల్యాండింగ్‌కు వాతావరణం అనుకూలించకపోవడంతో చాలా సేపు గాలిలోనే తిరుగుతూ ఉండిపోయింది.