YSRCP Vs TDP : పులివెందులో వైఎస్ జగన్‌కు ఊహించని షాక్..

ABN , First Publish Date - 2023-09-06T19:47:30+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు (AP Assembly Polls) దగ్గరపడుతున్న కొద్దీ అధికార వైసీపీకి (YSR Congress) ఎదురుదెబ్బలు ఎక్కువయ్యాయి. ఓ వైపు గడప గడపకు కార్యక్రమంలో ఎమ్మెల్యేలను జనాలు నిలదీస్తుండటం.. కొన్ని నియోజకవర్గా్ల్లో వైసీపీ నేతలు రాజీనామా చేస్తుండటం ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సంఘటనలే జరుగుతున్నాయి...

YSRCP Vs TDP : పులివెందులో వైఎస్ జగన్‌కు ఊహించని షాక్..

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు (AP Assembly Polls) దగ్గరపడుతున్న కొద్దీ అధికార వైసీపీకి (YSR Congress) ఎదురుదెబ్బలు ఎక్కువయ్యాయి. ఓ వైపు గడప గడపకు కార్యక్రమంలో ఎమ్మెల్యేలను జనాలు నిలదీస్తుండటం.. కొన్ని నియోజకవర్గా్ల్లో వైసీపీ నేతలు రాజీనామా చేస్తుండటం ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సంఘటనలే జరుగుతున్నాయి. కొందరేమో పార్టీ కోసం అహర్నిశలు శ్రమించినా తమకు తగిన ప్రాధాన్యత ఇవ్వట్లేదని వైసీపీని వీడుతున్నారు. ఇవన్నీ ఒక ఎత్తయితే.. సీఎం వైఎస్ జగన్ రెడ్డి (CM YS Jagan Reddy) సొంత ఇలాకా, పులివెందుల నియోజకవర్గంలో ఊహించని షాక్ తగిలింది.


TDP.jpg

అసలేం జరిగింది..?

పులివెందుల (Pulivendula) నియోజకవర్గంలో వందలాది ఓటర్లు, వైసీపీ కార్యకర్తలు ఆ పార్టీకి గుడ్ బై చెప్పేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు (TDP Chief Chandrababu) పులివెందుల పర్యటనలో మొదలైన వలసల పర్వం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే వందలాది మంది వైసీపీ కార్యకర్తలు టీడీపీ కండువాలు కప్పుకోగా.. తాజాగా వైసీపీకి చెందిన 30 కుటుంబాలు సైకిలెక్కాయి. వీరంతా వేంపల్లి మండలం తూపల్లె, అలిరెడ్డిపల్లె గ్రామాలకు చెందిన వారు. పులివెందుల టీడీపీ ఇన్‌చార్జి బీటెక్ రవి (Btech Ravi)ఆధ్వర్యంలో ఈ స్వచ్ఛంద చేరికలు జరిగాయి. వైసీపీ కార్యకర్తలందరికీ పసుపు కండువాలు కప్పిన రవి.. టీడీపీలోకి సాదరంగా ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారికి తగిన గుర్తింపు ఇవ్వడంతో పాటు.. అన్ని విధాలుగా అండగా ఉంటానని రవి హామీ ఇచ్చారు.

Updated Date - 2023-09-06T19:47:30+05:30 IST