YS Viveka case : ఎంపీ అవినాష్‌రెడ్డికి మరోసారి నోటీసులు.. ఈసారి కచ్చితంగా హాజరు కావాల్సిందేనన్న సీబీఐ

ABN , First Publish Date - 2023-03-06T08:26:31+05:30 IST

వైఎస్ వివేకానంద హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డికి సీబీఐ అధికారులు మరోసారి నోటీసులు అందజేశారు. నిన్న రాత్రి మరోసారి పులివెందులలోని ఎంపీ అవినాష్ రెడ్డి ఇంటికి వెళ్ళి మరీ నోటీసులు అందజేశారు.

YS Viveka case : ఎంపీ అవినాష్‌రెడ్డికి మరోసారి నోటీసులు.. ఈసారి కచ్చితంగా హాజరు కావాల్సిందేనన్న సీబీఐ

YS Viveka murder case : వైఎస్ వివేకా (YS Viveka) హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి (MP Avinash Reddy)కి సీబీఐ (CBI) అధికారులు మరోసారి నోటీసులు అందజేశారు. నిన్న రాత్రి మరోసారి పులివెందుల (Pulivendula)లోని ఎంపీ అవినాష్ రెడ్డి (MP Avinash Reddy) ఇంటికి వెళ్ళి మరీ నోటీసులు అందజేశారు. ఈ నెల10 తేదీన హైదరాబాద్ సీబీఐ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో అధికారులు పేర్కొన్నారు. అలాగే ఈ నెల 12వ తేదీన విచారణకు హాజరుకావాలని అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి (Bhaskar Reddy)కి నోటీసులు జారీ చేశారు.

ఎంపీ అవినాష్ రెడ్డి నేడు సీబీఐ ఎదుట విచారణకు హాజరు కావలసి ఉంది. అయితే వ్యక్తిగత కారణాలతోటి హాజరు కాలేకపోతున్నానని సీబీఐ అధికారులకు లేఖ రాశారు. దీంతో ఈ నెల 10 తేదీన కచ్చితంగా విచారణ హాజరు కావాలంటూ నోటీసులో సీబీఐ స్పష్టం చేసింది. అయితే ముందుగా నేడు అంటే 6వ తేదీన విచారణకు హాజరు కావాలని రెండు రోజుల క్రితం సీబీఐ అధికారులు నోటీసులు ఇచ్చారు. ముందస్తు కార్యక్రమాలు ఉన్నందున రాలేనని సీబీఐకి అవినాష్ రెడ్డి లేఖ రాశారు. మరోసారి నోటీస్ ఇచ్చి10 తేదీన కచ్చితంగా హాజరుకావాలని సీబీఐ అధికారులు చెప్పారు.

Updated Date - 2023-03-06T08:29:28+05:30 IST