Chandrababu : రాజమండ్రి సెంట్రల్ జైలులో పర్యటించడానికి చంద్రబాబుకు అనుమతి

ABN , First Publish Date - 2023-05-05T13:47:33+05:30 IST

రాజమండ్రి సెంట్రల్ జైలులో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటనకు జైలు అధికారులు అనుమతి ఇచ్చారు.

Chandrababu : రాజమండ్రి సెంట్రల్ జైలులో పర్యటించడానికి చంద్రబాబుకు అనుమతి

రాజమండ్రి : రాజమండ్రి సెంట్రల్ జైలులో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటనకు జైలు అధికారులు అనుమతి ఇచ్చారు. ఈ రోజు మధ్యాహ్నం నాలుగు గంటలకు ములాఖత్‌పై టీడీపీ నేతలు ఆదిరెడ్డి అప్పారావు, వాసులను పరామర్శించనున్నారు. చంద్రబాబుతో పాటు టీడీపీ నేతలు అచ్చెన్నాయుడు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, నిమ్మకాయల చినరాజప్ప, పితాని సత్యనారాయణకు ములాఖత్ కోసం టీడీపీ నేతలు దరఖాస్తు చేశారు. అచ్చెన్నాయుడు, గోరంట్ల బుచ్చయ్య చౌదరిలకు మాత్రమే అనుమతిస్తామని జైలు అధికారులు చెబుతున్నారు.

Updated Date - 2023-05-05T13:47:33+05:30 IST