Chandrababu: ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీకి చంద్రబాబు ఫోన్
ABN , First Publish Date - 2023-04-30T18:06:15+05:30 IST
ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని (TDP MLA Adireddy Bhavani)కి టీడీపీ అధినేత చంద్రబాబు ఫోన్ చేశారు. భవాని భర్త ఆదిరెడ్డి శ్రీనివాస్‌ను (Adireddy Srinivas) ఏపీ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు.
అమరావతి: ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని (TDP MLA Adireddy Bhavani)కి టీడీపీ అధినేత చంద్రబాబు ఫోన్ చేశారు. భవాని భర్త ఆదిరెడ్డి శ్రీనివాస్‌ను (Adireddy Srinivas) ఏపీ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ అరెస్ట్ నేపథ్యంలోనే చంద్రబాబు భవానికి ఫోన్ చేశారు. అరెస్ట్ ఆ తర్వాత జరిగిన పరిణామాలను చంద్రబాబు (Chandrababu) అడిగి తెలుసుకున్నారు. భవానికి చంద్రబాబు ఫోన్‌లో ధైర్యం చెప్పారు. ఆదిరెడ్డి ఆప్పారావు, శ్రీనివాస్ అరెస్టును ఖండిస్తున్నామని ఆయన ప్రకటించారు. వైసీపీ ప్రభుత్వ తీరులో మార్పు రావడం లేదని మండిపడ్డారు. రాజకీయ వేధింపులు, కక్ష సాధింపులు కొనసాగుతున్నాయని దుయ్యబట్టారు. అక్రమ కేసులు, అరెస్టులను ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని, రాజమండ్రి (Rajahmundry)లో ఆదిరెడ్డి అప్పారావు, శ్రీనివాస్ అరెస్టులే అందుకు సాక్ష్యమన్నారు. సీఐడీ (CID) దర్యాప్తు ఏజెన్సీనా? లేక వైసీపీ వేధింపుల ఏజెన్సీనా? అని చంద్రబాబు ప్రశ్నించారు. కోర్టులు చీవాట్లు పెట్టినా ప్రభుత్వ బుద్ధి మారకపోవడం.. సీఎం జగన్రెడ్డి విషపు రాజకీయ ఆలోచనలకు నిదర్శనమని చంద్రబాబు దుయ్యబట్టారు.
ఆదిరెడ్డి భవాని భర్త ఆదిరెడ్డి వాసును ఏపీ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. వాసుతో పాటు మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావును (Adireddy Apparao) కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. వాసు ప్రస్తుతం టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శిగా పనిచేస్తున్నారు. తండ్రీ, కుమారుడు ఇద్దర్నీ రాజమండ్రి సీఐడీ కార్యాలయానికి పోలీసులు తరలించారు. అయితే ఈ ఇద్దర్ని ఏ విషయంలో అరెస్ట్ చేశారనే విషయం తెలియట్లేదు. చిట్ ఫండ్ కేసు (Chit Fund Case) లో అరెస్ట్ చేశారా..? లేకుంటే మరో కేసులో అరెస్టు చేశారా..? అనే దానిపై స్పష్టత రాలేదు. టీడీపీ నేతలపై కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే అక్రమ అరెస్టులు చేశారని టీడీపీ నేతలు (TDP Leaders) సీఐడీ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. అటు అరెస్ట్.. ఇటు ఆందోళనతో రాజమండ్రిలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది.