Chandrababu news: ఏపీ హైకోర్టులో చంద్రబాబుకు నిరాశ... ఏకవాక్యంతో కోర్టు తీర్పు...

ABN , First Publish Date - 2023-09-22T13:48:36+05:30 IST

స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో (Skill development Case) అక్రమ అరెస్ట్‌ను సవాలు చేస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టును (AP High Court) ఆశ్రయించిన మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబుకు నిరాశ ఎదురైంది. చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను ఏపీ హైకోర్ట్ కొట్టివేసింది. సీఐడీ తరుపు లాయర్లతో జడ్జి ఏకీభవించారు. పిటిషన్‌ను కొట్టివేస్తున్నట్టు ఏకవాఖ్యంతో కోర్ట్ తీర్పునిచ్చింది.

Chandrababu news: ఏపీ హైకోర్టులో చంద్రబాబుకు నిరాశ... ఏకవాక్యంతో కోర్టు తీర్పు...

అమరావతి: స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో (Skill development Case) అక్రమ అరెస్ట్‌ను సవాలు చేస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టును (AP High Court) ఆశ్రయించిన మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబుకు నిరాశ ఎదురైంది. చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను ఏపీ హైకోర్ట్ కొట్టివేసింది. సీఐడీ తరుపు లాయర్లతో జడ్జి ఏకీభవించారు. పిటిషన్‌ను కొట్టివేస్తున్నట్టు ఏకవాఖ్యంతో కోర్ట్ తీర్పునిచ్చింది.


కాగా.. స్కిల్‌ డెవలప్‌మెంట్ అక్రమ కేసు, అక్రమ అరెస్టు వ్యవహారాలకు సంబంధించి తనపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌, అనంతరం ఏసీబీ కోర్టు జారీ చేసిన రిమాండ్‌ ఉత్తర్వులను సవాలు చేస్తూ చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌ను దాఖలు చేశారు. ఈ కేసులో రిమాండ్ చెల్లదని సవాలు చేసిన విషయం విధితమే. దీనిపై ఈనెల 19న వాదనలు జరిగాయి. చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు న్యాయవాదులు హరీశ్‌ సాల్వే, సిద్ధార్థ లూథ్రా, సీఐడీ తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది ముకుల్‌ రోహత్గీ వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు తీర్పుని శుక్రవారానికి రిజర్వు చేసిన విషయం తెలిసిందే.

సుప్రీంకోర్టుకు టీడీపీ..

ఏపీ హైకోర్టులో ఊరట దక్కకపోవడంతో దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును ఆశ్రయించాలని టీడీపీ నిర్ణయించింది. హైకోర్ట్ తీర్పును సుప్రీంలో సవాలు చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. దీనిపై ఇప్పటికే పార్టీ సీనియర్ నేతలు చర్చించి నిర్ణయం తీసుకున్నారు.

Updated Date - 2023-09-22T13:56:54+05:30 IST